YS Jaganmohan reddy : నిమ్మగడ్డ మీద జగన్ ఆఖరి అస్త్రం , అర్జెంట్ గా డిల్లీ కి ?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగక తప్పేలా లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతగా ఎన్నికలు వద్దు అనుకున్నా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే అన్నట్లుగా భావిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో ఎన్నికలు జరిగితే వచ్చే సమస్య ఏంటీ అన్నట్లుగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. రాజకీయ దురుద్దేశ్యంతో ఎన్నికలను వాయిదా వేసేందుకు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఏకంగా సుప్రీం కోర్టు వైఎస్ జగన్ ను ప్రశ్నించడంతో ప్రస్తుతం వైకాపా నాయకులు ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది. వైకాపా నాయకులు మొదటి నుండి కూడా నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్ల కూడదు అనే నిర్ణయంతో ఉన్నారు. కాని కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు సహకరించాల్సిందే అంటూ క్లారిటీ వచ్చేసింది.
YS Jaganmohan reddy: వైఎస్ జగన్ చివరి ప్రయత్నం..
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలను ఆపేందుకు చివరి ప్రయత్నంగా కేంద్రం వద్దకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్ షాలతో మాట్లాడి స్థానిక సంస్థల ఎన్నికలను కొన్ని రోజుల పాటు వాయిదా వేయించేందుకు ప్రయత్నించాలని భావిస్తున్నారు. అందుకోసం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఢిల్లీ వెళ్లగా అక్కడ ఎలాంటి స్పందన వస్తుంది అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఒక వైపు తెలుగు దేశం పార్టీ నాయకులు ఎన్నికలకు సిద్దం అవుతుండగా వైకాపా నాయకులు మాత్రం వెళ్లాల వద్దా అనే మిమాంశలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
కేంద్రం చెప్తే నిమ్మగడ్డ రమేష్ వింటాడా…
కేంద్రం వద్దకు సీఎం వైఎస్ జగన్ వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒక వేళ జగన్ తో సంబంధాల కోసం కేంద్రం సరే అని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నం చేస్తే మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒప్పుకుంటాడా అనేది ప్రశ్న. చాలా మంది కూడా నిమ్మగడ్డ మొండి వైఖరి గురించి మాట్లాడుతున్నారు. అలాంటి ఖచ్చితంగా కేంద్రం చెప్పినా కూడా నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల విషయంలో ఖచ్చితంగా వెనక్కు తగ్గడు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ జగన్ చేయబోతున్న ప్రయత్నం ఎంత వరకు సఫలం అవుతుందో తెలియాలంటే ఒకటి రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.