Siddham : రీసౌండ్ చేసిన సిద్ధం సభ.. గెలుపెవరిదో తేలిపోయినట్లే..!
ప్రధానాంశాలు:
Siddham : రీసౌండ్ చేసిన సిద్ధం సభలు.. గెలుపెవరిదో తేలిపోయినట్లే..!
Siddham : ‘ సిద్ధం ‘ పేరుతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు ప్రాంతాలలో మూడు సభలు నిర్వహించారు.ఈ సభలు అన్ని కూడా లక్షలాది మంది జనంతో జన సముద్రాన్ని తలపించాయి. మొదటి సభ భీమిలిలో జరగగా దానికి మించి ఏలూరు సభ ఇంకా బాగా జరిగింది. ఇక ఇప్పుడు రాప్తాడు బ్రహ్మాండంగా సాగింది. ఈ మూడు సభలతో వైసీపీ స్టామినా ఏంటో నిరూపించింది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో ఎప్పుడూ జరిగే సభలు కాదు. ఏపీ మొత్తంలో మూడు ప్రధాన ప్రాంతాలు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సభ మూడు అంటే మూడే సభలు ప్రతిపక్షాలకు పగిలిపోయేలా వైసీపీ సిద్ధం సభలు జరిగాయి. ఈ సభలలో వైయస్ జగన్ ఎక్కడా తగ్గలేదని తెలిసిపోతుంది.
ఎన్నికలు దగ్గర పడుతుంటే అధికార పార్టీకి చమటలు పడతాయి కానీ మేము సిద్ధం మీరు సిద్ధమా అని సవాల్ విసరడంలో వైసీపీ సక్సెస్ అవుతుందని అంటున్నారు. విపక్షాలు ఇంకా సర్దుకోకముందే మేము సిద్ధమని వైసీపీ జనంలోకి వెళుతుంది. మూడు ప్రాంతాలలో జరిగిన మూడు సభలు వైసీపీ గట్టి పట్టు ఉందని నిరూపించాయి. క్యాడర్ కి లీడర్ కి మధ్య కనెక్షన్ కరెక్ట్ గా సెట్ అయిందని చెప్పుకొచ్చాయి. ఎన్నికల్లో చొక్కాలు మడతపెట్టి మరి యుద్ధానికి సై అంటాము అని క్యాడర్ గట్టి భరోసా ఇచ్చేలా చేశాయి. సిద్ధం సభలతో మొత్తం 175 నియోజకవర్గాలలో పార్టీ క్యాడర్ కు వైయస్ జగన్ సందేశం పంపించారు. అదే సమయంలో జనాలకు ఒక సంకేతం ఇచ్చారు. విపక్షాలకు ఒక పెద్ద సంశయం మిగుల్చారు.
వైసీపీ అంటే ఒక్క ఛాన్స్ పార్టీ కాదని 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని వైఎస్ జగన్ చెప్పకనే చెప్పారు. సిద్ధం సభల వల్ల విపక్షాలకు తెలియవలసింది చాలానే ఉంది. వైయస్ జగన్ ఓడించడం కష్టమే అన్నది ఆ సందేశం. వైఎస్ జగన్ కి ఉన్న క్రేజ్ సభల ద్వారా తెలిసింది. అది ఒక్క ఛాన్స్ తో పోదు అని కూడా ఈ సభల ద్వారా అర్థం అవుతుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ఇంకా చాలా చేయాలనేది ప్రతిపక్షానికి అర్థం అవుతుంది. ఏది ఏమైనా వైయస్ జగన్ మూడు సభలు వైసీపీ సదాసిద్ధం అన్నది చెప్పేసాయి. వైసీపీ కూడా తమదే విజయం అని డిక్లేర్ చేసింది. మరోసారి జనాలు మాకే ఛాన్స్ ఇస్తారు అని ధీమా వ్యక్తం చేస్తుంది.