YS Sharmila : బెయిల్ వచ్చినా అనంతరం SI పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!
YS Sharmila : YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల విధులు నిర్వహిస్తున్న పోలీసులపై చేయి చేసుకున్న కేసులో అరెస్టయి చంచల్ గూడా జైల్లో ఉండటం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న బెయిల్ రావడంతో.. అనంతరం ఆమె మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. పేపర్ లీకేజ్ ఘటన విషయంలో దర్యాప్తు వేగవంతం చేయాలని సిట్ కార్యాలయానికి తన ఇంటి వద్ద నుండి బయలుదేరుతుండగా.. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు.
నేనొక పార్టీ అధ్యక్షురాలు అని అటువంటిది నన్ను అడ్డుకోవటానికి మగ పోలీసులు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. మహిళా పోలీసులను తీసుకురాకుండా విచక్షణ రహితంగా వ్యవహరించారు. వచ్చినా పెద్ద మగ పోలీస్ కూడా నా బాడీని తాకే ప్రయత్నం చేసే రీతిలో కళ్ళు పెద్దవి చేసి బెదిరించే విధంగా వ్యవహరించాడు. తర్వాత వచ్చిన మహిళా పోలీసులు… దాడి చేసే విధంగా.. నన్ను అటు ఇటు లాగడం జరిగింది. ఆనాడు ఎన్నికల ప్రచారంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. దాని గురించి ప్రశ్నిస్తుంటే ఒక మహిళను చూడకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అని చూడకుండా
విచక్షణ రహితంగా దారుణంగా వ్యవహరించారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ కాకుండా మరి ఏమనాలి. పోలీసులు… తాలిబాన్ లు మాదిరిగా వ్యవహరించారని షర్మిల కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంత దారుణంగా పోలీసులను నా మీద వ్యవహరిస్తే నేను నడుస్తున్న టైంలో మళ్లీ వాళ్లు నా మీద దాడి చేస్తారేమోనని నేను కొద్దిగా వాళ్ళని తోసే ప్రయత్నం చేస్తే…. నేను పోలీసులపై దాడి చేసినట్లు మీడియా సృష్టించింది. కెసిఆర్ కి తొత్తులుగా పోలీసులు వ్యవహరించారు. సెలెక్టివ్ వీడియోలు మాత్రమే రిలీజ్ చేశారు అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.