
election commission green signal for ys sharmila party
Ys Sharmila వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి పెదవి విప్పారు వైఎస్ షర్మిల.. Ys Sharmila ఇప్పటివరకు మీడియాలో వెల్లువెత్తిన అనేక పుకార్లపైనా క్లారిటీ ఇచ్చారు. ఏపీ సీఎం, తన అన్న వైఎస్.జగన్‌తో విభేదాలున్నాయని, అందుకే తెలంగాణలో పార్టీ పెట్టారని వస్తున్న పుకార్లపై నోరు విప్పారు. ఎవరైనా పుట్టింటిపై అలిగితే వారితో మాట్లాడరని.. అంతేతప్ప కొంత పార్టీ పెట్టరని స్పష్టతనిచ్చారు. వైఎస్.జగన్ Ys jagan పై విభేదించి, అలిగానని అంటున్నారు. ఆడపిల్లలు అలిగితే పుట్టింటికి వెళ్లడం మానేస్తారు. వారితో మాట్లాడడం మానేస్తారు. అంతేతప్ప ఇలా పార్టీలు పెట్టరు. ఇది ప్రజల పార్టీ. ప్రజల మేలు కోసం పెట్టిన పార్టీ. మా నాన్న ప్రేమించిన తెలంగాణ Telangana ప్రజలకు అన్యాయం జరుగుతోందనే పెట్టానని, ఎవరి మీదా అలిగి పెట్టిన పార్టీ కాదని అన్నారు. ఇది గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ అని, ప్రజల మేలు కోసం పోరాడుతుందని, ఈ పార్టీని అవమానిస్తే వైఎస్ఆర్‌ను అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు. ఎవరితోనో విభేదించి పెట్టిన పార్టీగా దీన్ని చూడకండి. ప్రజలు ఆశీర్వదిస్తే వారికి నమ్మకంగా పనిచేస్తామని షర్మిల అన్నారు.
Ys Sharmila comments on ys Jagan kcr
రాక్షస పాలన వద్దనే ఏపీలో టీడీపీని గద్దె దింపారని వైఎస్ షర్మిల చెప్పారు. వైసీపీ హయాంలో అక్కడ రాజన్న రాజ్యమే స్థాపిస్తున్నట్లు కనిపిస్తోందని.. ఒకవేళ వారు సుపరిపాలన అందించకపోతే ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించరని ఏపీ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు వైఎస్ఆర్ వ్యతిరేకం కాదన్నారు వైఎస్ షర్మిల. ”ప్రజలకు వైఎస్ ఎంత సేవ చేశారో పల్లెలకు వెళ్లి అడిగితే చెబుతారు. తెలంగాణకు వైఎస్ఆర్ వ్యతిరేకం కాదు.
Ys jagan
తెలంగాణ అవసరమని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడే చెప్పారని అన్నారు. 2000 సంవత్సరంలో 41 మందితో మెమోరాండం తయారుచేసి ప్రత్యేక రాష్ట్రం అవసరమని కేంద్రానికి పంపించారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు పెద్దపీట వేశారు. వైఎస్ ఉన్నప్పుడు తెలంగాణకు భయం లేదు. ఆయన మరణించిన తర్వాత తమ భవిష్యత్ గురించి భయపడ్డారని, వైఎస్ మరణించాకే శ్రీకాంతాచారి చనిపోయారని, దీంతోనే మలిదశ ఉద్యమం మొదలయిందని చెప్పారు. తెలంగాణ బిడ్డలను వైఎస్ఆర్ గుండెల్లో పెట్టి చూసుకున్నారని, ఉద్యమంలో ఎంతోమంది పాల్గొన్నారని, కొందరు ముందుండి నడిపించారని అన్నారు.
kcr
ఉద్యమంలో పాల్గొనని వాళ్లకు తెలంగాణపై ప్రేమ లేదనడం అన్యాయమన్న వైఎస్ షర్మిల తెలంగాణ బాగుండాలని ఎంతో మంది కోరుకున్నారన్నారు. తెలంగాణ నా గడ్డ. ఈ గడ్డకు మేలు చేయడానికే వచ్చానని షర్మిల స్పష్టం చేశారు. బోర్డు మీటింగ్‌లకు పిలిస్తే వెళ్లనందునే కేంద్రం కలగజేసుకొని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు షర్మిల. తెలంగాణ దక్కాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా వదులుకునేది లేదని, ఇతర ప్రాంతాలకు చెందాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా అడ్డుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగితే ఢిల్లీకి వెళ్లైనా కొట్లాడతామని అన్నారు. కేంద్రం గెజిట్‌ను పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు వైఎస్ షర్మిల. తొలిసారి మీడియా ముందుకు వచ్చిన వైఎస్.షర్మిల వ్యాఖ్యానాలు .. సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
ఇది కూడా చదవండి ==> ఈ మూడు జిల్లాలతో వైఎస్ జగన్‌కు తిప్పలు తప్పదా…?
ఇది కూడా చదవండి ==> దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై దేశద్రోహం కేసు.. కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్..?
ఇది కూడా చదవండి ==> చంద్రబాబుకు తలనొప్పిగా మారిన ఆ ఒక్కడు..?
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.