ys sharmil : షర్మిల ఎక్కడ నుండి పోటీ చేసేది క్లారిటీ వచ్చేసింది.. అక్కడి పరిస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్
ys sharmila : తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం ఖరారు అయ్యింది. వచ్చే నెల 9వ తారీకున ఖమ్మంలో షర్మిల తలపెట్టిన సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ సమావేశంలో తన పార్టీని ప్రకటించేందుకు షర్మిల కసరత్తులు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటుపై దృష్టి పెట్టింది. అలాగే పార్టీ ఏర్పాటు విషయమై అన్ని విషయాలను ఇప్పటికే వైఎస్ షర్మిల నాయకులతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో షర్మిల వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటీ చేస్తుంది అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. హైదరాబాద్ మరియు ఖమ్మం జిల్లాల నుండి షర్మిల పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని మొదటి నుండి ప్రచారం జరుగుతోంది.
ys sharmila : పాలేరు లో పోటీకి సై..
ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లుగా వైఎస్ షర్మిల ప్రకటించింది. తనకు పులివెందుల మాదిరిగా పాలేరు కూడా అన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు చేసింది. పులి వెందుల తన తండ్రికి సోదరుడికి ఎలా పర్మినెంట్ నియోజక వర్గంగా మారిందో అలా తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం పాలేరు నుండి పోటీ చేసి తీరుతాను అంటూ ఆమె బలంగా చెబుతోంది. ఇప్పటికే ఒక వర్గం వారు షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టడంను వ్యతిరేకిస్తున్నారు. కాని కొందరు మాత్రం ఆమెకు బ్రహ్మరథం పట్టేందుకు సిద్దంగా ఉన్నామంటూ చెబుతున్నారు.
ys sharmila పాలేరులో పరిస్థితి ఏంటీ..
వైఎస్ షర్మిల పాలేరులో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మరి పాలేరులో వైఎస్ షర్మిలకు ఉన్న పరిస్థితి ఏంటీ అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఎందుకు వైఎస్ షర్మిల అంత బలంగా పాలేరును ఎంపిక చేసుకుంది అంటే అక్కడ వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. నియోజక వర్గంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన వారు ఇంకా కూడా ఆయన్ను గుండెల్లో పెట్టుకుని ఉన్నారు. అందుకే షర్మిల అక్కడ నుండి పోటీకి ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. షర్మిల పార్టీ నాయకులు కూడా అక్కడ నుండి అయితేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. అది కూడా వైఎస్సార్ వల్లే అనేది చాలా మంది అభిప్రాయం. అందుకే షర్మిల అక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు.