YS Sharmila : ఇంకా పార్టీనే పెట్టలేదు.. అప్పుడే ఇంత డేరింగ్ స్టెప్పా? షర్మిల ఐడియాస్ మామూలుగా లేవుగా?
YS Sharmila : వైఎస్ షర్మిల అనే పేరు ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఎక్కడ చూసినా తన గురించే చర్చ. అసలు షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతుందని.. ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. అంతే కదా. షర్మిల ఏంటి.. తెలంగాణలో పార్టీ పెడుతా? అని ప్రకటించడం ఏంటి? తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా అని అంత నమ్మకంతో చెప్పడం ఏంటి? అసలు.. షర్మిల వెనుక ఎవరున్నారు. ఇంత డేరింగ్ నిర్ణయం వెనుక ఎవరున్నారు? అనేది పక్కన పెడితే.. షర్మిల ఒక అడుగైతే ముందుకు వేశారు. తర్వాత ఏం జరుగుతుంది అనేది సెకండరీ.

ys sharmila important decision on her party
అయితే.. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. షర్మిల మరో స్టెప్ ముందుకు వేసి.. మరో డేరింగ్ డిసిజన్ తీసుకున్నారట. అదే ప్రజా సమస్యలపై పోరుకు సిద్ధమవడం. తెలంగాణలో ఉన్న ప్రజా సమస్యలపై ఆమె అప్పుడే కన్నేశారట.
YS Sharmila : ఆదివాసీల పోడు భూముల సమస్య పరిష్కారం దిశగా అడుగు
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అతి పెద్ద సమస్య.. ఆదివాసీలు, గిరిజనుల పోడు భూముల సమస్య. ఇది ఇప్పటిది కాదు కానీ.. ఈ సమస్య ఇంకా తీరడం లేదు.
అందుకే.. ఈ సమస్యను తీర్చి తెలంగాణ ప్రజల్లో కాసింత నమ్మకాన్ని పొందాలన్న సదుద్దేశంతో షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 21న ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు షర్మిల. అలాగే.. ఆ సమావేశంతో పాటు ఆదివాసీలు, గిరిజనులతో కూడా ఆమె సమావేశం కానున్నారు.
తెలంగాణలో ఎక్కువగా… ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో పోడు భూముల సమస్య అధికంగా ఉంది. అందుకే.. ఆదివాసీల పక్షాన పోరాటం చేయడానికి షర్మిల మందుకొచ్చారు. ఇంకా తన పార్టీ పేరు కూడా ప్రకటించలేదు.. విధివిధానాలు కూడా ప్రకటించలేదు. కానీ.. అప్పుడే ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు అంటే షర్మిల ప్లాన్స్ మామూలుగా లేవు. ఎంతైనా రాజన్న కూతురు కదా. ఆమాత్రం ఫైర్ ఉంటుంది లెండి.