YS Sharmila : ఆ రెండు జిల్లాల ప్రజలు ఏం పాపం చేశారు కేసీఆర్… వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila : ఆ రెండు జిల్లాల ప్రజలు ఏం పాపం చేశారు కేసీఆర్… వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్?

 Authored By jagadesh | The Telugu News | Updated on :26 March 2021,5:19 pm

YS Sharmila : వైఎస్ షర్మిల రోజురోజుకూ తన దూకుడును పెంచుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. తనను ఎవరు విమర్శించినా అస్సలు వదిలిపెట్టడం లేదు. వాళ్ల తాట తీస్తున్నారు. మొత్తానికి అన్నకు తగ్గ చెల్లెలు అనిపించుకొని… వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు షర్మిల బాగానే కృషి చేస్తున్నారు.

త్వరలోనే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి… పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటించనున్నారు షర్మిల.

ys sharmila shocking comments over irrigation projects in telangana

ys sharmila shocking comments over irrigation projects in telangana

దాని కోసమే షర్మిల.. తెలంగాణలోని అన్ని జిల్లాల నేతలతో ఆమె సమావేశమవుతున్నారు. వైఎస్సార్ అభిమానులతో మాట్లాడుతున్నారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అందరితో చర్చిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ…. తెలంగాణలో ప్రస్తుతం సాగుతున్న పాలనపై… ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజలను ప్రభుత్వాలు ఎలా మోసం చేశాయో చెప్పుకొచ్చారు.

ఆదిలాబాద్ జిల్లా అంటేనే… పచ్చని అడవులకు కేరాఫ్ అడ్రస్. ఆదిలాబాద్ జిల్లా అంటేనే తెలంగాణ కాశ్మీర్. జల్ జమీన్ జంగల్ కోసం నిజాంను తరిమికొట్టిన కొమురం భీం పుట్టిన గడ్డ ఆదిలాబాద్. తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడి… తన పదవులకు రాజీనామా చేసిన కొండా లక్ష్మణ్ ది కూడా ఆదిలాబాద్ జిల్లానే.. అంటూ ఆదిలాబాద్ జిల్లా చరిత్ర గురించి షర్మిల గొప్పలు చెప్పారు.

అలాగే.. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ప్రొఫెసర్ కోదండరామ్ పుట్టిన గడ్డ కూడా ఆదిలాబాద్ అన్నారు. ఆనాడు పోడు భూములకు పట్టాలు ఇచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆమె కొనియాడారు.

ఆదిలాబాద్ జిల్లా అంటేనే ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు గుర్తొస్తుందని… కానీ… ఆదిలాబాద్ జిల్లాకే తలమానికం అయిన ప్రాజెక్టును రీడిజైన్ చేసి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు తీవ్ర అన్యాయం చేశారని షర్మిల విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో ఆ రెండు జిల్లాలకు తీరని అన్యాయం చేశారన్నారు.

YS Sharmila : వైఎస్సార్ హయాంలోనే పూర్తయిన మేజర్ ప్రాజెక్టులు

వైఎస్సార్ హయాంలోనే మేజర్ ప్రాజెక్టులు పూర్తయ్యాయని… తెలంగాణను సస్యశ్యామలం చేయడం కోసం ఎన్నో ఎత్తిపోతల పథకాలను నిర్మించిన ఘనత వైఎస్సార్ కే దక్కుతుందన్నారు. అలీ సాగర్ ప్రాజెక్టు కానీ… ఎల్లంపల్లి, సాలూరు, గూడెం ప్రాజెక్ట్.. అన్నింటినీ వైఎస్సార్ పూర్తి చేశారని స్పష్టం చేశారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది