YS Sharmila : అది లెక్క.. కాంగ్రెస్‌లో షర్మిలకు కీలక పదవి.. వెంటనే తలూపిన షర్మిల.. వైఎస్సార్టీపీ విలీనం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : అది లెక్క.. కాంగ్రెస్‌లో షర్మిలకు కీలక పదవి.. వెంటనే తలూపిన షర్మిల.. వైఎస్సార్టీపీ విలీనం

YS Sharmila : ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పుంజుకుంటోంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలుసు కదా. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం డీకే శివకుమార్. అందుకే.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల్లో డీకే శివకుమార్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లోనూ ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు. సోనియా గాంధీ కూడా డీకే శివకుమార్ ను ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. తెలంగాణలో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :12 August 2023,6:32 pm

YS Sharmila : ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పుంజుకుంటోంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలుసు కదా. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం డీకే శివకుమార్. అందుకే.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల్లో డీకే శివకుమార్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లోనూ ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు. సోనియా గాంధీ కూడా డీకే శివకుమార్ ను ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం శివకుమార్ తన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే పరిస్థితులు ఉన్నాయి. కర్ణాటక ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలంగాణలో ఉండబోతోంది. అలాగే.. అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అందుకే.. తెలంగాణ మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. తమతో కలిసి వచ్చే వాళ్లను ప్రోత్సహిస్తోంది. పార్టీలోకి చేరికలు కూడా పెరుగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల సారథ్య బాధ్యతలను డీకే శివకుమార్ తీసుకోవడంతో ఇక తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చినట్టే అని భావించాలి.

ys sharmila to get key position in congress party

ys sharmila to get key position in congress party

YS Sharmila : షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవడం లాంఛనమేనా?

అయితే.. వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం అవడం దాదాపు లాంఛనమే అని అనుకోవాలి. దానికి కారణం డీకే శివకుమార్. షర్మిల పార్టీని కాంగ్రెస్ లో కలపాలనే ప్రతిపాదన తీసుకొచ్చిందే ఆయన. ఎందుకంటే.. వైఎస్సార్ కూతురుగా షర్మిలతో డీకే శివకుమార్ కు సత్సంబంధాలే ఉన్నాయి. షర్మిల కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవగానే బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ ను కలిసి వచ్చారు. అప్పుడే డీకే కూడా షర్మిలకు మంచి ఆఫర్ ఇచ్చారట. కాంగ్రెస్ లో విలీనం చేయాలని కోరారట. డీకే చెప్పారు కాబట్టే షర్మిల కూడా ఈ విషయంపై పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. డీకే నాయకత్వంలో తెలంగాణలోనే షర్మిలకు కీలక పదవి కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతా ఓకే అయితే.. ఇక షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవ్వడం పక్కా అని చెప్పుకోవచ్చు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది