YS Sharmila : జెట్ స్పీడ్ లో షర్మిల.. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఈనెల 15 నుంచి దీక్ష..?
YS Sharmila : ప్రస్తుతం తెలంగాణలో వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు వైఎస్ షర్మిల. ఇటీవలే షర్మిల ఖమ్మం జిల్లాలో సంకల్ప సభను నిర్వహించారు. ఆ సభలో ప్రసంగించిన షర్మిల తెలంగాణ మన పార్టీ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తెలంగాణను అయితే సాధించుకున్నాం కానీ… మనం కన్న కలలను సాధించుకోలేదని… సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆమె దుయ్యబట్టారు.
వైఎస్సార్ తన హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారని.. కానీ.. కేసీఆర్ మాత్రం ఉన్న సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేయలేకపోతున్నారని… చివరకు యువకులను కూడా మోసం చేశారని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే… నిలదీసేందుకే పార్టీ పెడుతున్నట్టు ఆమె ప్రకటించారు. తెలంగాణ ప్రజల కోసం… వాళ్ల సమస్యలపై పోరాటం చేయడం కోసం తాను ఎంత దూరం అయినా వెళ్తానని మాటిచ్చారు. అలా మాటిచ్చారో లేదో… ఇలా సమస్యలపై పోరాడేందుకు ఆమె సిద్ధమయ్యారు.
YS Sharmila : ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇందిరా పార్క్ వద్ద షర్మిల ధర్నా
ఖమ్మం సభలో షర్మిల స్పష్టం చేసినట్టుగానే. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వెంటనే నోటిఫికేషన్ ను రిలీజ్ చేయకపోతే.. ఈనెల 15 నుంచి ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టనున్నట్టు లోటస్ పాండ్ వర్గాలు వెల్లడించాయి.
ఇందిరా పార్క్ వద్ద భారీగా నిరుద్యోగులతో కలిసి షర్మిల ఈ దీక్షలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. మరి… షర్మిల దీక్షతోనైనా సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తారా? వేచి చూడాల్సిందే.