YS Sharmila : రంగంలోకి షర్మిలమ్మ… ముందు కేసీఆర్ దగ్గరికే.. ?
YS Sharmila : వైఎస్ షర్మిల మరోసారి యాక్టివ్ కానున్నారు. ఆ మధ్య ఖమ్మంలో సభ పెట్టిన తర్వాత ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగ సంకల్ప సభను నిర్వహించారు. ఆ తర్వాత తన ఇంటి వద్ద లోటస్ పాండ్ లో మరో రెండు రోజులు దీక్ష చేపట్టారు. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కరోనా ఉద్దృతి పెరగడంతో వైఎస్ షర్మిల కొన్ని రోజులు సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా అదుపులో ఉండటంలో.. మరోసారి తను తెలంగాణ పర్యటన చేయనున్నారు. రేపటి నుంచే అంటే జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచే తను తెలంగాణ పర్యటన చేయనున్నట్టు తెలుస్తోంది.
లోటస్ పాండ్ వర్గాల సమాచారం మేరకు.. జూన్ 2 న ఉదయమే వైఎస్ షర్మిల గన్ పార్క్ కు చేరుకొని అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం ఆమె గజ్వేల్ పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. గజ్వేల్ నియోజకవర్గం అంటే అది తెలంగాణ సీఎం కేసీఆర్ నియోజకవర్గం. అంటే షర్మిల డైరెక్ట్ గా కేసీఆర్ నే ఢీకొనబోతున్నారన్నమాట. తన మొదటి పర్యటనకు గజ్వేల్ నే ఎంచుకోవడాకి కారణం.. సీఎం సొంత నియోజకవర్గం కావడం. అక్కడ ఉద్యోగాలు రాక.. ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు.
YS Sharmila : తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేవరకు విశ్రమించేది లేదు
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రభుత్వం జారీ చేయాలని.. ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వైఎస్ షర్మిల చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోసారి అదే నినాదంతో తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పర్యటించనున్నారు. అందులో భాగంగా ముందు గజ్వేల్ లో పర్యటించి ఆ తర్వాత మిగితా ప్రాంతాల్లో షర్మిల పర్యటన ఉంటుందని లోటస్ పాండ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టే విషయంపై వైఎస్సార్ అభిమానులతో సమావేశం అయ్యారు. పలువురు నేతలను కూడా కలిశారు. కొత్త పార్టీ కోసం తెలంగాణ మొత్తం పర్యటించారు. తాజాగా మరోసారి ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ వ్యాప్తంగా పర్యటించనున్నారు.