YS Sharmila : కేటీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ వైఎస్ షర్మిల.. మరో ట్వీట్ తో షర్మిల కౌంటర్?

YS Sharmila : వైఎస్ షర్మిల.. తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత దూకుడు మీదున్నారు. తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సమయం దొరికతే చాలు.. వెంటనే సీఎం కేసీఆర్ పై, మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా ట్వీట్లతో షర్మిల తెలంగాణ ప్రభుత్వానికి కౌంటర్లు ఇస్తున్న విషయం తెలిసిందే.

ys sharmila tweet on ktr fans telangana

అయితే.. శనివారం.. జులై 24న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వైఎస్ షర్మిల ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని ఇవ్వాలని.. విద్యార్థులకు పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ ఇచ్చే మనసును ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను.. మీ బాధ్యతను గుర్తు చేస్తూ ఓ వీడియో కానుక అంటూ ఇటీవల ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న వీడియోను షర్మిల పోస్ట్ చేశారు.

YS Sharmila : షర్మిల ట్వీట్ పై… కేటీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

అయితే.. షర్మిల ట్వీట్ పై కేటీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. షర్మిలకు కౌంటర్లు ఇచ్చారు. కేటీఆర్ మద్దతుదారులు ఆమె ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ సెటైర్లు వేస్తూ కామెంట్లు చేశారు. దీంతో ఆ ట్వీట్ నిన్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఆ ట్వీట్ పై షర్మిల మళ్లీ ఇంకో ట్వీట్ చేశారు.

నేను ఉద్యోగాలు ఇవ్వాలంటూ కోరాను. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వమంటూ కోరాను.. తప్పితే నేనేమీ లేనిది అడగలేదు.. దానికి నాపై వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారు. మా పోరాటం గళమెత్తిన శ్రీకాంత్ లాంటి యువకులు ఆత్మహత్యలు ఆపడమే. చిన్న దొరగారు ఆడవాళ్లు వత్రాలు చేసుకోవాలి అని అన్నప్పుడు నిద్ర నటిస్తూ.. నిన్నటి పుట్టిన రోజు శుభాకాంక్షలకు ఉలిక్కిపడి లచి.. నిరుద్యోగుల సమస్యలపైన మా పోరాటానికి మరింత ఆదరణ తీసుకొచ్చినందుకు కేటీఆర్ గురి సైన్యానికి ధన్యవాదాలు. మీ వ్యక్తిగత దూషణతో మా పోరాట స్ఫూర్తిని మరింత పెంచారు. మా కన్నా మేము ఎంచుకున్న పోరాటం చాలా గొప్పది. మీరు మమ్మల్ని అణిచివేయాలని ఎంత గింజుకున్నా యువతకు ఉద్యోగాలు ఇచ్చే వరకు మా పోరు సాగుతూనే ఉంటుంది. అంతవరకు మీకు ప్రతిరోజు మీ చేతగానితనాన్ని గుర్తు చేస్తూనే ఉంటాం.. అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. అలాగే.. ఆత్మహత్య చేసుకున్న ఆ యువకుడు శ్రీకాంత్.. గతంలో పాడిన ఓ పాట వీడియోను కూడా షర్మిల పోస్ట్ చేసి.. కేటీఆర్ సైన్యానికి ఘాటు రిప్లయి ఇచ్చారు.

Recent Posts

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

55 minutes ago

Anitha : జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు..? హోంమంత్రి అనితా క్లారిటీ

Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…

2 hours ago

Old Women : పెన్షన్ కోసం వృద్ధురాలి తిప్పలు… కంటతడి పెట్టిస్తున్న వీడియో..!

Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…

3 hours ago

Kalpika Ganesh Father : నా కూతురికి మెంటల్ డిజార్డర్ స‌మ‌స్య ఉంది.. ఆమె పెద్ద ప్ర‌మాదమే అంటూ కల్పిక తండ్రి ఫిర్యాదు

Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…

4 hours ago

Viral Video : రాజన్న సిరిసిల్ల లో అరుదైన దృశ్యం.. శివలింగం ఆకారంలో చీమల పుట్ట..!

Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…

5 hours ago

Nara Lokesh : ఏపీకి బాబు బ్రాండ్ తీసుకొస్తుంటే.. వైసీపీ చెడగొడుతుందంటూ లోకేష్ ఫైర్..!

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌‌ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…

6 hours ago

Cricketer : న‌న్ను మోస‌గాడు అన్నారు.. ఆత్మ‌హత్య చేసుకోవాల‌ని అనుకున్నా.. క్రికెట‌ర్‌ కామెంట్స్..!

Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…

7 hours ago

Kingdom Movie Collections : హిట్ కొట్టిన కింగ్‌డమ్.. ఫ‌స్ట్ డే ఎంత వ‌సూలు చేసింది అంటే..!

Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‏డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…

8 hours ago