YS Viveka Case : పజిల్ పజిల్ పజిల్.. వివేకా కేసు అతిపెద్ద పజిల్ !
YS Viveka Case : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి కూడా నాలుగేళ్లు దాటింది. కానీ.. ఇప్పటి వరకు ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. ఈ కేసు పెద్ద మిస్టరీలా, పెద్ద పజిల్ లా తయారైంది. ఈ కేసు విచారణ గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఈ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. నిజానికి ఈ కేసును ఈ నెల 30 వరకు ఛేదించాలని సీబీఐకి సుప్రీంకోర్టు గడువు విధించింది. కానీ.. 30 రోజుల్లో ఈ కేసు దర్యాప్తు పూర్తవడం కష్టమని భావించిన సీబీఐ.. గడువు పెంచాలని కోరడంతో జూన్ 30 వరకు గడువు ఇచ్చింది.
అయితే.. నాలుగేళ్ల నుంచి కొలిక్కిరాని ఈ కేసు ఇంకో నెల రోజుల్లోనే ఎలా కొలిక్కి వస్తుంది అనేది అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ కొత్త బృందం విచారిస్తోంది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అని సీబీఐ వాదిస్తోంది. దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం స్పష్టంగా చూపించలేకపోతోంది. ఈనేపథ్యంలో వివేకానంద రెడ్డి రెండో భార్య షమీమ్ స్టేట్ మెంట్ ను సీబీఐ తీసుకుంది.
YS Viveka Case : వివేకానంద రెడ్డి రెండో భార్య షమీమ్ స్టేట్ మెంట్ తీసుకున్న సీబీఐ
అసలు వివేకానంద హత్యకు కారణమే ఇంట్లో జరిగిన గొడవలు అని అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయినా కూడా సీబీఐ పట్టించుకోవడం లేదు. ఇక.. విచారణ ముగుస్తున్న సమయంలో వివేకా రెండో భార్య షమీమ్ స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఆ స్టేట్ మెంట్ ఆధారంగానే వివేకానంద రెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీబీఐ విచారించింది. నాలుగేళ్ల నుంచి వాళ్లను విచారించని సీబీఐ.. ఇప్పుడు ఎందుకు విచారించింది అనేదే పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఇలా.. వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూ పెద్ద పజిల్ లా తయారైంది. ఈ రెండు నెలల్లో అయినా ఈ కేసు కొలిక్కి వస్తుందో లేదో.. వేచి చూడాల్సిందే.