YS Viveka Case : వైయస్ భాస్కర్ రెడ్డినీ అరెస్టు వీడియో..నెలరోజుల ముందే వివేక హత్యకు భారీ ప్లాన్..!!
YS Viveka Case : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకోవటం తెలిసిందే. ఏప్రిల్ 30వ తారీకు లోపు కేసు విచారణ మొత్తం కంప్లీట్ కావాలని సీబీఐకి సుప్రీమ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పులివెందులలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. వివేక హత్య కేసులో భాస్కర రెడ్డి హత్యసాక్షాలు చెరిపేయటంలో పాత్ర ఉందని సీబీఐ అభియోగాలు మోపింది. వివేక గుండెపోటుతో మరణించినట్లు మొదట భాస్కర్ రెడ్డి ప్రచారం చేశారని పేర్కొంది. అంతేకాదు హత్యకు ముందు తర్వాత నిందితులతో తన ఇంట్లో సమావేశమైనట్లు
గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించినట్లు సీబీఐ స్పష్టం చేయడం జరిగింది. దీంతో పులివెందులలో ఆదివారం ఉదయం వైయస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే నెలరోజుల ముందే వివేక హత్యకు భారీ ప్లాన్ వేసినట్లు సరికొత్త టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో భాస్కర రెడ్డి సెల్ ఫోన్ సీజ్ చేసినట్లు దానిలో సంచలన విషయాలు ఉన్నట్లు ఏపీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.