YSRCP : వైకాపా 12 ఆవేదన నుండి పుట్టిన పార్టీకి అద్బుత రెస్పాన్స్
YSRCP : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సమయంలో ఎంతో మంది తెలుగు ప్రజలు గుండె లు బాదుకున్నారు. రాజశేఖర్రెడ్డి మృతితో ఎన్నో గుండెలు ఆగి పోయాయి. వారందరి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తన తండ్రి కోసం ప్రాణాలు అర్పించిన వారికి, వారి కుటుంబాలకి అండగా నిలిచేందుకు జగన్మోహన్రెడ్డి తన వంతు సహాయం అందించేందుకు ముందుకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందుకు నిరాకరించింది.ఓదార్పు యాత్రను కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. తన తండ్రి చావును తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అధిష్టానం అనుమతి తనకు అవసరం లేదు అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు కదిలారు.
ఆ సమయంలోనే ఆయన వైకాపా ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. పార్టీ ప్రారంభించిన కొన్నాళ్లకే వచ్చిన ఉప ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ తర్వాత 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో అతి స్వల్ప మెజారిటీతో చంద్రబాబు నాయుడు అధికార పీఠాన్ని దక్కించుకున్నాడు.2019లో చంద్రబాబు నాయుడు ను జనాలు తిరస్కరించి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధికార పగ్గాలను అందించారు. వైకాపా ఏర్పాటు అయి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆవేదన నుంచి పుట్టిన పార్టీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి అద్భుతమైన ప్రయోజనాలను సాధించి పెడుతోంది.
వైకాపా ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత సంక్షేమ ప్రభుత్వం గా గుర్తింపు దక్కించుకుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలనను అందిస్తున్నారు. పార్టీ ప్రారంభించిన తక్కువ సమయంలోనే అద్భుతమైన రెస్పాన్స్ తగ్గించుకోవడంతో పాటు గొప్ప విషయాలను కూడా సొంతం చేసుకుంది. ముందు ముందు మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటూ ఆ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో మరో సారి ఘన విజయం దిశగా నడిపించేందుకు గాను జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ఇప్పటి నుండి మొదలు పెట్టారు. నాయకులు కూడా అందుకోసం ఆయన వెంట సైనికుల మాదిరిగా అడుగులు వేస్తున్నారు.