thota trimurthulu : వైఎస్సార్సీపీలోనే ‘‘తోట‘’ను టార్గెట్ చేస్తున్న‌రా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

thota trimurthulu : వైఎస్సార్సీపీలోనే ‘‘తోట‘’ను టార్గెట్ చేస్తున్న‌రా..?

 Authored By kondalrao | The Telugu News | Updated on :20 June 2021,2:10 pm

Thota Trimurthulu : తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు తోట త్రిమూర్తులు thota trimurthulu లేటెస్టుగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. దీంతో ఆయన్ని వ్యతిరేకించే సొంత పార్టీలోని నేతలు, ప్రతిపక్ష పార్టీలోని లీడర్లు ఏకమయ్యారు. రెండున్నర దశాబ్దాల కిందటి ఒక వ్యవహారాన్ని తెర మీదికి తెచ్చారు. తోట త్రిమూర్తులు thota trimurthulu అప్పట్లో ఒక ఎస్సీ వ్యక్తికి గుండు కొట్టించినట్లు కేసు నమోదైంది. అది ఆయన్ని ఇప్పటికీ రాజకీయంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. నిన్న గాక మొన్న కూడా అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు అపొజిషన్ పార్టీ లీడర్లు ఇదే విషయాన్ని మీడియా ముందు ప్రస్తావించారు. ఎస్సీ ద్రోహికి ఏమిటీ అందలం? అని ప్రశ్నించారు. 25 సంవత్సరాల కిందట పేపర్లలో ప్రింట్ అయిన న్యూస్ క్లిప్పింగులను ప్రదర్శించారు.

ysrcp groups targeting ap mlc thota trimurthulu

ysrcp groups targeting ap mlc thota trimurthulu

ప్రతిపక్షాలకు వాళ్లిద్దరు తోడు.. thota trimurthulu

రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ ముఖ్య నేతల మధ్య అస్సలు పడట్లేదు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కి, రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుకి తాజాగా ఎమ్మెల్సీ అయిన తోట త్రిమూర్తులు అంటే పీకల దాకా వ్యతిరేక భావం ఉంది. బోస్ కి, తోటకి మధ్య రాజకీయ వైరం ఈనాటిది కాదు. మూడున్నర దశాబ్దాలుగా కొనసాగుతోంది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో తోటను ఓడించింది ఎవరో కాదు. చెల్లుబోయిన వేణే కావటం గమనార్హం. ప్రస్తుతం మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న తోటను రామచంద్రాపురం సెగ్మెంట్ లోకి ఎంటర్ అవ్వకుండా చేసేందుకు పైన చెప్పుకున్న ఇద్దరు నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

Ys Jagan

Ys Jagan

పుండు మీద కారం.. : Thota Trimurthulu

ఇదే సమయంలో తోట త్రిమూర్తులు thota trimurthuluను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసన మండలికి పదోన్నతి కల్పించటం బోసు, వేణుల పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది. ఆ కోపంతోనే వాళ్లిద్దరు ప్రత్యక్షంగా బయటపడకుండా విపక్ష ఎస్సీ నాయకులను మీడియా ముందు పెట్టి తోట మీద దుమ్మెత్తి పోసేలా చేశారనే టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్షాలకు పదునైన అస్త్రాన్ని ఇచ్చి తోటను పరోక్షంగా టార్గెట్ చేశారని విశ్వసనీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పాలిటిక్సులో ఫస్ట్ నుంచే మంచి పేరు లేని తోట thota trimurthuluకు సీఎం వైఎస్ జగన్ ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారని వైఎస్సార్సీపీలోని ఒక వర్గం కుతకుతలాడుతోంది.

Ysrcp

Ysrcp

రివెంజ్ తప్పదా?.. thota trimurthulu

తనకు ఎమ్మెల్సీగా మరోసారి పొలిటికల్ లైఫ్ వచ్చిందనే సంతోషం తోట త్రిమూర్తులుకు లేకుండా చేస్తున్న సదరు లీడర్లపై భవిష్యత్తులో ప్రతీకారం తప్పదని ఆయన గ్రూపు హెచ్చరిస్తోంది. ఈ వర్గ విభేదాలు జిల్లా రాజకీయాల పైన, రానున్న అసెంబ్లీ ఎన్నికల పైన ఎఫెక్ట్ చూపుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదిలోనే ఈ ఆధిపత్య పోరుకు ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని సూచిస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> nara lokesh : నారా లోకేష్ ఈ సారి పోటీ మంగళగిరి కాద‌ట‌..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Balineni : బాలినేనికి బై చెబుతారా.. కొనసాగింపు కష్టమేనా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> chandra babu : చంద్రబాబు నాయుడు ఆ సువర్ణావకాశాన్ని ఎందుకు చేజార్చుకున్నారా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> ysrcp : సీనియర్స్ వర్సెస్ జూనియర్స్.. మ‌ధ్య‌లో న‌లిగిపోతున్న గురుమూర్తి…!

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది