YSRCP Jayaho BC Sabha : విజయవాడలో వాడవాడలో “జయహో బీసీ మహాసభ” ఏర్పాట్లు..!!
YSRCP Jayaho BC Sabha : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో జయహో బీసీ మహాసభకి జనాలు భారీ ఎత్తున రావడం జరిగింది. రాష్ట్రంలో బీసీ వర్గాలకు ఇప్పటివరకు చేసిన మంచి పనులు ఇంకా రాబోయే రోజుల్లో చేయబోయే పనులకు సంబంధించి సవివరంగా ఈ సభలో వివరించనున్నారు. జయహో బీసీ సభ వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీంతో విజయవాడ నగరం మొత్తం జయహో బీసీ జెండాలు… హోర్డింగ్లతో నిండిపోయాయి. కృష్ణానది ఇంకా ఇందిరాగాంధీ స్టేడియం బందరు రోడ్డు చుట్టూ ప్రక్కల మొత్తం జయహో బీసీ జెండాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఈ మహాసభ జరగనుంది. ఈ కార్యక్రమానికి గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పదవులు వచ్చిన బీసీ ప్రజాప్రతినిధులంతా హాజరయ్యారు.
దాదాపు 84 వేల మందికి పైగా ఆహ్వానాలు పార్టీ పంపడం జరిగింది. వైసీపీ ప్లీనరీ సమావేశం సక్సెస్ అయిన తరహాలో… విజయహో బీసీ మహాసభ విజయవంతం చేయడానికి పార్టీ అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న బీసీ ప్రతినిధులకు విజయవాడ మరియు గుంటూరు నగరాల్లో నాలుగు వేలకు పైగా హోటల్ గదులు ఇంకా 100కు పైగా కమ్యూనిటీ హాళ్లు పలు కళ్యాణ మండపాలను వసతి కొరకు ముందే బుక్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చే వారికి పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు వివిధ రకాలతో ముందుగానే మెనూ ప్లాన్ చేయడం జరిగింది. వెనుకబడి తరగతులకు చెందిన పంచాయతీ వార్డు మెంబర్ మొదలుకొని రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులు ఇంకా నామినేటెడ్ పదవుల్లో ఉన్న బీసీ వర్గాల నాయకులు ఈ మహాసభకు రావడం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల లో 2000 బస్సులు ప్రత్యేకంగా ఈ సభ కోసం ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా రెండు వేల భారీ వాహనాలు ఇంకా సొంత కారులు మరియు బైకులతో పెద్ద సంఖ్యలో ఈ సభకు జనాలు వస్తూ ఉండటంతో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. విజయవాడ నగరం మీదుగా దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను నగరు శివారు ప్రాంతాల నుంచి మళ్లిస్తున్నారు. బందరు రోడ్డులో బెంజి సర్కిల్ నుంచి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వరకు బీసీ సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ సభతో రాష్ట్రవ్యాప్తంగా బీసీ వర్గాలకు జగన్ ప్రభుత్వం అందించిన మేలును .. రాబోయే రోజుల్లో చేయబోయే పలు కార్యక్రమాలను వివరించే దిశగా వైసీపీ పార్టీ ప్లాన్ చేయడం జరిగింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మూడున్నరేళ్లలో బీసీ కులాలు వివిధ సంక్షేమ పథకాల కింద రూ. 1.63 లక్షల లబ్ధి పొందాయి. అంతే కాకుండా బీసీ కులాలను రాజకీయంగానూ పైకి తేవాలనే సంకల్పంతో పదవుల్లో రిజర్వేషన్ కల్పించారు.