TDP : ప్రజల్లో అభద్రతా భావం కల్పించే ప్రయత్నాల్లో టీడీపీ
TDP : దేశంలో ఎక్కడ లేని అభివృద్ది కార్యక్రమాలు ఆంద్ర ప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆద్వర్యంలో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క ముఖ్య మంత్రికూడా అమలు చేయలేనన్ని సంక్షేమ పథకాలను ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. ఇంత చేస్తున్న కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తూ సంక్షేమ పథకాల యొక్క లబ్ధిదారుల పొట్ట కొట్టే విధంగా తెలుగు దేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారంటూ వైకాపా మాజీ మంత్రి ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్య కర్తలు కింది స్థాయి ప్రజలను మరియు బడుగు బలహీన వర్గాల వారిని ఆందోళనకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు.
తెలుగు దేశం పార్టీ నాయకులు పదే పదే సంక్షేమ పథకాల విషయంలో చేస్తున్న అసత్య ప్రచారాలు వల్ల సామాన్య ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే చాలా సార్లు సంక్షేమ పథకాల అమలు ఆగిపోతుందని నిధుల కొరత వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులే ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతున్నాయి అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ వైకాపా నాయకులు ఆరోపించారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రజలు తెలుగు దేశం పార్టీకి అధికారాన్ని కట్ట బెట్టారు. అధికారం వచ్చిన ప్రతి సారి కూడా వారు తమ లబ్ధి కోసం తమ వాళ్ళ అభివృద్ధి కోసం పాటు పడ్డారు.

ysrcp leaders fire on tdp and chandra babu naidu
ఒక్కసారి కూడా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పని చేయ లేదు. మొదటి సారి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యి ప్రజల కోసం పని చేస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు మరియు ఆయన టీం కలిసి ఎట్టి పరిస్థితుల్లో జగన్ ను గద్దె దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అన్ని చూస్తున్నారని.. అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని 2024 సంవత్సరంలో కచ్చితంగా ఏపీలో మళ్లీ అధికారంలోకి వస్తుందని వైకాపా నాయకులు ధీమాగా ఉన్నారు. పొత్తుల వల్ల ఒరిగేదేమీ లేదంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.