ysrcp : జగన్ మాట పట్టించుకోని సొంత పార్టీ నేతలు.. ఇలా అయితే గురుమూర్తికి కష్టం
తిరుపతి ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఈ పోటీ ప్రధానంగా వైకాపా మరియు టీడీపీల మద్య ఉంటుందని భావిస్తున్నారు. వైకాపాకు ఇది సిట్టింగ్ స్థానం కనుక అధికార పార్టీ ఈజీగా గెలుస్తుందనే నమ్మకం అందరిలో ఉంది. కాని మెజార్టీ భారీ ఎత్తున ఉండాలనే ఉద్దేశ్యంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే తిరుపతి ఉప ఎన్నిక కు సంబంధించిన సమావేశం నిర్వహించాడు. ఆ సందర్బంగా పార్టీ నేతలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ సమయంలో పార్టీ ముఖ్య నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించడం జరిగింది.
ysrcp leaders : ఇంచార్జ్‌లు పట్టించుకోవడం లేదు..
వైకాపా ముఖ్య నాయకులను మండలంకు ఒక ఇంచార్జ్ గా నియోజక వర్గంకు ఒక ఇంచార్జ్ గా నియమించడం జరిగింది. అలా నియమించిన సమయంలో కొందరు పడని వారు కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా వైకాపా నాయకులు పలువురు మంత్రి పెద్ద రెడ్డి పై గుర్రుగా ఉన్నారు. వారు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారంకు ఆసక్తి చూపడం లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించినా కూడా వారు నామమాత్రంగానే తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి పెద్ది రెడ్డితో ఉన్న విభేదాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆయన నుండి దూరం జరిగేందుకు ప్రయత్నాలు చేస్తూ తిరుపతి ఉప ఎన్నిక విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. మండలం మరియు నియోజక వర్గంలో ఇంచార్జ్ లు పట్టించుకోవడం లేదని కొందరు ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
గురుమూర్తి ఆందోళన…
వైకాపా తిరుపతి అభ్యర్థిగా వైస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంకు అత్యంత సన్నిహితుడిగా పేరు పడిపోయిన డాక్టర్ గురుమూర్తిని ఎంపిక చేయడం జరిగింది. ఆయన జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఆయన కు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సహకరించక పోవడంతో ఓటమి భయం లేకున్నా మెజార్టీ తగ్గుతుందేమో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లాలనే నిర్ణయంతో కూడా ఉన్నారు. మొత్తానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట కూడా ఆయన సొంత పార్టీ నాయకులు వినక పోవడం విడ్డూరం అంటున్నారు.