Pawan Kalyan : జనసేన పార్టీని ప్యాకేజీ కోసం మళ్లీ తాకట్టు ద్వారంపూడి
Pawan Kalyan : జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైకాపా పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలువురు అధికార పార్టీ నాయకులు మరియు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని గమనించకుండా ప్రజల పక్షం అంటూ అధికార పక్షం పై విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని వైకాపా నాయకులు జన సేనానికి సున్నితంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వాస్తవాలు తెలుసుకోకుండా జనసేన మీటింగ్ లో ప్రజలనుద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఆయన తీరుని బహిర్గతం చేస్తున్నాయని ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీని ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టే పవన్ కళ్యాణ్ మరో సారి పొత్తు పేరుతో ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నాడు అంటూ ఎమ్మెల్యే ఆరోపించాడు. బిజెపి మరియు తెలుగు దేశం పార్టీలతో ఆయన పొత్తుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.. తద్వారా ఆయన భారీ ప్యాకేజీని ఆశిస్తున్నారని కూడా ద్వారపూడి అన్నారు.
రాష్ట్ర ప్రజలకు వైకాపా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అందుతున్నాయి. కనుక ఈ సమయం లో మరో పార్టీకి సంబంధించిన అవసరం కాని ఆవశ్యకత కానీ లేదని… ఈ సమయంలో పొత్తులు పెట్టుకున్నా కూడా కచ్చితంగా రాష్ట్ర ప్రజలు వైకాపా వెంటే ఉంటారని ఎమ్మెల్యే దీమా వ్యక్తం చేశారు. త్వరలోనే జన సైనికులు పవన్ కళ్యాణ్ యొక్క అసలు స్వరూపం ను చూస్తారు అంటూ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. జనసేన పార్టీ కచ్చితంగా తెలుగు దేశం పార్టీ కోసం మాత్రమే పని చేస్తుందని.. బిజెపికి మరియు తెలుగుదేశం పార్టీకి మధ్య వారధిగా మాత్రమే జనసేన ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.