Ysrcp : కన్నీళ్ళతో నారా భువనేశ్వరి కాళ్లు కడుగుతామంటూ వైసీపీ ఏమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
Ysrcp ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో రకంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె, చంద్ర బాబు సతీమణి నారా భువనేశ్వరి ఎపిసోడ్ కు ఇప్పట్లో ముగింపు కార్డ్ పడేలా కనిపించడం లేదు. ఈ వివాదంపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అధికార పార్టీ నేతలు అహంకారంతో ప్రతీ పక్ష పార్టీ అధినేత కుటుంబంపై అన్యాయంగా మాట్లాడుతున్నరంటూ.. వి సపోర్ట్ చంద్రబాబు అంటూ ఓ ఉద్యమమే జరుగుతోంది. మరోవైపు ఇదే వివాదం పై స్పందిస్తున్న వై సీ పీ మంత్రులు, ఏమ్మెల్యేలు మాత్రం.. చంద్రబాబు నాయుడువి అన్నీ డ్రామాలని.. నారా భువనేశ్వరిపై ఎవరూ చెడు వ్యాఖ్యలు చేయలేదంటూ సమర్ధించుకుంటూ వెళ్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ వివాదం పై ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నారా భువనేశ్వరి విషయంలో తలెత్తిన ఘటనపై స్పందించిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అసెంబ్లీలో జరిగిన ఘటనలో వాస్తవం ఉందని పరోక్షంగా ఒప్పుకుంటూనే.. సభలో జరిగిన దానికి పశ్చాత్తాపం కోరుతున్నట్లు ప్రకటించారు. ఓ సోదరి వంటి మహిళను బజారుకీడ్చడం ఎంతో బాధాకరమంటూ ఆయన వ్యాఖ్యానికించారు. చట్ట సభలో ఓ మహిళను ఇలా బాధపెట్టడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తన కన్నీళ్లతో భువనేశ్వరి కాళ్లు కడుగుతాను అని అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వ్యాక్యాలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
Ysrcp కన్నీళ్ళతో ఆమె కాళ్ళు కడుగుతాం
సీఏం జగన్ తల్లి విజయమ్మ అయినా.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయినా, సాటి మహిళ ఎవరైనా తాము గౌరవంగా చూస్తామంటూ రాచమల్లు తెలిపారు. రాజకీయ నాయకులే కాదు.. ఎవరూ మహిళలను కించపరచినా అది ముమ్మాటికీ తప్పేనని అన్నారు. తమ వల్ల, తమ పార్టీ నాయకుల వల్ల ఎవరైనా బాధ పడితే తమను క్షమించాలని వేడుకున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కూడా రాచమల్లు ఫైర్ అయ్యారు. ఆనాడు సత్యహరిశ్చంద్రుడు ఇచ్చిన మాటకోసం భార్యను చక్రవర్తి ఇంటికి పనికి పంపితే.. ఈనాడు చంద్రబాబు ఓట్ల కోసం, తన భార్య శీలాన్ని బజారు కీడ్చడం ఏమాత్రం బాగా లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చెడు రాజకీయాలను చంద్రబాబుకు మానుకోవాలని ఆయన సూచించారు