ysrcp party ఏపీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయాన్ని సొంతం చేసుకున్న వైకాపా ను మళ్లీ అధికారంలోకి తీసుకు రావాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న అభివృద్ది మరియు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు దక్కించుకుంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ ఆయనే సీఎం అంటూ టాక్ వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఆయన మాత్రమే కాకుండా ఆయన మంత్రి వర్గ సహచరలు మరియు ఇతర పార్టీ నాయకులు కూడా బాగా పని చేస్తేనే లాభం ఉంటుంది. అలా కాదని ఎలాగూ పార్టీ జోరు మీద ఉంది.. మేము ఏం చేయకున్నా కూడా తదుపరి ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తాం అనే ఫలింగ్ ఉంటే మాత్రం 2024 ఎన్నికల్లో కష్టం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగూతు ఉంటే ఇటీవల గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ లు మరియు మున్సిపల్ ప్రజా ప్రతినిదులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వారు కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటం వల్లే ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. వారు కనుక ఈ సమయంలో ప్రజల్లోకి వెళ్లకుంటే మాత్రం వ్యతిరేకత మొదలయ్యే అవకాశం ఉంది. కింది స్థాయిలో విమర్శలు వ్యతిరేకత మొదలయితే మాత్రం ఇక అంతే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే మంత్రి పెద్ది రెడ్డి మాట్లాడుతూ.. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడగలేదు కనుక అందుకే వారి కష్టాలు మీకు అర్థం అవ్వడం లేదు. ఎందుకు మీరు ప్రజల్లోకి వెళ్లడం లేదు అంటూ కింది స్థాయి ప్రజా ప్రతినిధులను మంత్రి ప్రశ్నించాడు. సీఎం దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్లింది. అందుకే ప్రజల్లోకి వెళ్లకుండా తమకు పట్టనట్లుగా ఉంటున్న ప్రజా ప్రతినిధులను మాత్రం సస్పెండ్ చేసే వరకు వెళ్లవలిసి వస్తుందంటూ హెచ్చరించాడు. ఇప్పటికి అయినా కింది స్థాయి నాయకులు కార్యకర్తలకు మరియు ప్రజలకు అందుబాటులో ఉండాలని అధనాయకత్వం ఆదేశించింది. మీరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటే వచ్చే ఎన్నికల్లో పార్టీకి చాలా నష్టం కలుగుతుందని అంటున్నారు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.