Ysrcp
YSRCP గుంటూరు : టీడీపీ తరపున గెలిచి వైసీపీ YSRCP లో చేరిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌కు ఆ పార్టీ నేత చంద్రగిరి ఏసురత్నం షాక్ ఇచ్చారు. ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. గిరిధర్ తప్పుడు అఫిడవిట్ వేశారని అనేక విషయాలు గోప్యంగా ఉంచారని..చెప్పిన విషయాలు కూడా అబద్దాలని ఏసురత్నం హైకోర్టును ఆశ్రయించారు.
Ysrcp
నిజానికి మద్దాలి గిరి వైసీపీలో చేరక ముందే ఏసురత్నం పిటిషన్ వేయగా, అది ఇప్పుడు విచారణకు రానుంది. ఎమ్మెల్యే వైసీపీలో చేరినప్పటికీ.. తన పిటిషన్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఏసురత్నం అంటున్నారు. అంతేగాక ఏసురత్నం.. తన దగ్గరున్న సాక్ష్యాలతో మద్దాలి గిరిధర్ పై అనర్హత వేటు వేయించేందుకు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. గతంలో తప్పుడు అఫిడవిట్లు, కేసులను దాచి పెట్టడం వంటి కారణాలతో పలు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడింది.
గత టీడీపీ హయాంలో అనంతపురం జిల్లా మడకశిర నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఈరన్న నామినేషన్ పత్రాల్లో కొన్ని వివరాలు తప్పుగా ఇచ్చారని నిర్దారించిన హైకోర్టు ఆ ఎమ్మెల్యేపై అనర్హతా వేటు వేసింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా.. సమర్థించింది. దాంతో ఆ ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి వైసీపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ఖరారు చేశారు. అయితే సహజంగా ఇలాంటి పిటిషన్ల విచారణ ఏళ్లకేళ్లు సాగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకూ.. ఇలాంటి పిటిషన్లపై పదవి కాలం ముగిసిన తర్వాత కూడా తీర్పులొచ్చాయి.
ys jagan
కానీ ఈరన్నకు మాత్రం .. కొంత కాలం పదవి కోల్పోక తప్పలేదు. ఈ విషయంలో మద్దాలి గిరిధర్ కు ఎలాంటి ఫలితం వస్తుందోనన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఏం జరిగినా వైసీపీలో రచ్చ జరగడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చిన తనకు ప్రాధాన్యత కల్పించడం లేదని మద్దాలి గిరిధర్ అలక పూనినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
This website uses cookies.