YSRCP : వైసీపీ ఎమ్మెల్యేనే టార్గెట్ చేసిన వైసీపీ సీనియర్ నేత.. ఈ విషయం జగన్ కు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YSRCP : వైసీపీ ఎమ్మెల్యేనే టార్గెట్ చేసిన వైసీపీ సీనియర్ నేత.. ఈ విషయం జగన్ కు తెలిస్తే ఇంకేమన్నా ఉందా?

 Authored By sukanya | The Telugu News | Updated on :19 August 2021,8:15 am

YSRCP గుంటూరు : టీడీపీ తరపున గెలిచి వైసీపీ YSRCP లో చేరిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌కు ఆ పార్టీ నేత చంద్రగిరి ఏసురత్నం షాక్ ఇచ్చారు. ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. గిరిధర్ తప్పుడు అఫిడవిట్ వేశారని అనేక విషయాలు గోప్యంగా ఉంచారని..చెప్పిన విషయాలు కూడా అబద్దాలని ఏసురత్నం హైకోర్టును ఆశ్రయించారు.

Ysrcp

Ysrcp

నిజానికి మద్దాలి గిరి వైసీపీలో చేరక ముందే ఏసురత్నం పిటిషన్ వేయగా, అది ఇప్పుడు విచారణకు రానుంది. ఎమ్మెల్యే వైసీపీలో చేరినప్పటికీ.. తన పిటిషన్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఏసురత్నం అంటున్నారు. అంతేగాక ఏసురత్నం.. తన దగ్గరున్న సాక్ష్యాలతో మద్దాలి గిరిధర్ పై అనర్హత వేటు వేయించేందుకు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. గతంలో తప్పుడు అఫిడవిట్లు, కేసులను దాచి పెట్టడం వంటి కారణాలతో పలు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడింది.

మడక శిర ఈరన్న.. YSRCP

గత టీడీపీ హయాంలో అనంతపురం జిల్లా మడకశిర నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఈరన్న నామినేషన్ పత్రాల్లో కొన్ని వివరాలు తప్పుగా ఇచ్చారని నిర్దారించిన హైకోర్టు ఆ ఎమ్మెల్యేపై అనర్హతా వేటు వేసింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా.. సమర్థించింది. దాంతో ఆ ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి వైసీపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ఖరారు చేశారు. అయితే సహజంగా ఇలాంటి పిటిషన్ల విచారణ ఏళ్లకేళ్లు సాగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకూ.. ఇలాంటి పిటిషన్లపై పదవి కాలం ముగిసిన తర్వాత కూడా తీర్పులొచ్చాయి.

ys jagan

ys jagan

కానీ ఈరన్నకు మాత్రం .. కొంత కాలం పదవి కోల్పోక తప్పలేదు. ఈ విషయంలో మద్దాలి గిరిధర్ కు ఎలాంటి ఫలితం వస్తుందోనన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఏం జరిగినా వైసీపీలో రచ్చ జరగడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చిన తనకు ప్రాధాన్యత కల్పించడం లేదని మద్దాలి గిరిధర్ అలక పూనినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది