Asaduddin Owaisi : బ్రేకింగ్.. ఒవైసీకి జెడ్ కేటగిరి సెక్యూరిటీ, కేంద్రం ఆదేశాలు…!
Asaduddin Owaisi : ఉత్తరప్రదేశ్ లో కాల్పుల ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఆయనపై కాల్పులు జరిగాయి. తాను ప్రయాణం చేస్తున్న కారుపై కాల్పులు జరిగాయని… నాలుగు రౌండ్ల బులెట్ లు కాల్చారని… కారు టైర్ పంక్చర్ అయిందని ఒవైసీ పేర్కొన్నారు. తాను క్షేమంగా ఉన్నా అని ట్వీట్ కూడా చేసారు.
ఇక ఒవైసీకి ఎటువంటి గాయాలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఇది కీలకంగా మారే అవకాశం ఉందనే ప్రచారం కొందరు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆయనపై కాల్పులతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సిఆర్పిఎఫ్ జడ్ సెక్యూరిటీ కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

z category security center orders for oyc
నిన్నటి కాల్పుల ఘటన నేపథ్యంలో భద్రతపై సమీక్ష చేసి నిర్ణయం తీసుకున్న కేంద్ర హోంశాఖ… తక్షణమే సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా ఆదేశాలు ఇచ్చింది. 24 గంటల పాటు వ్యక్తిగత భద్రతా అధికారితో పాటు 22 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక హైదరాబాద్ లో ఎటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.