Zomato: జొమాటో స‌రికొత్త ఐడియా.. ఫుడ్‌తో పాటు అవి కూడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zomato: జొమాటో స‌రికొత్త ఐడియా.. ఫుడ్‌తో పాటు అవి కూడా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :30 January 2022,3:30 pm

Zomato : ఆన్‌లైన్‌లో ఆర్డరు పెడితే.. హోటళ్ల నుంచి ఆహార పదార్థాలు సరఫరా చేసే ప్లాట్‌ఫామ్‌ జొమాటో. ఇంట్లోవండుకోలేని ప‌రిస్థితుల‌లో జొమాటాలో ఆర్డర్ పెడితే క్ష‌ణాల‌లో మ‌నం కావాల‌నుకున్న రుచులు మ‌న ఇంట్లో ఉంటాయి. కోవిడ్ వ‌చ్చిలాక్ డౌన్ ఏర్పాటు చేశాక జొమాటో డిమాండ్ చాలా పెర‌గింది. రోజురోజుకు క‌స్ట‌మ‌ర్స్ దృష్టిని ఆక‌ర్షించేందుకు జొమాటో కొత్త ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తుంది. తాజాగా జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సేవల వ్యాపారంలోకి ప్రవేశించాలని కంపెనీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. జొమాటో యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీను ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలను కంపెనీ ముమ్మరం చేసింది.ఫుడ్‌తో పాటు లోన్ల‌ను కూడా అందించేందుకు జొమాటో సిద్ధ‌మైంది.

నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇన్‌క్రెడ్‌తో జొమాటో 2020లోనే ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా జొమాటోకు చెందిన రెస్టారెంట్ భాగస్వాములకు రుణాలను అందజేస్తుంది. ఇది స్థూల సరుకుల విలువలో గణనీయమైన క్షీణతకు దారితీసింది. రూ.10 కోట్లతో ఎన్‌బీఎఫ్‌సీని ఏర్పాటు చేయాలని జొమాటో భావిస్తోంది. ఇది పూర్తిగా జొమాటో అనుబంధ సంస్థగా ఉండనుంది.స‌బ్సీడ‌రీ కంపెనీకు ఏ పేరు పెట్టాలా అనే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఈ సంస్థకు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాలు మంత్రిత్వశాఖ, ఆర్‌బీఐ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదానికి లోబడి కంపెనీ పేరు ఖరారు చేయబడుతుందని జొమాటో బిఎస్‌ఇకి ఇచ్చిన ఫైలింగ్‌లో తెలిపింది.

zomato form non banking finance company

zomato form non banking finance company

Zomato : జొమాటో స‌రికొత్త ఆలోచ‌న‌..

ఇదిలా ఉండగా హైదరాబాద్‌కు చెందిన యాడ్‌ఆన్‌మో అనే స్టార్టప్‌లో జొమాటో వాటాలను కొనుగోలు చేసినట్లు సమాచారం. పెట్టుబ‌డుల విష‌యానికి వ‌స్తే డిజిజ‌ల్ అడ్వ‌ర్టైజింగ్ కంపెనీ యాడ్ఆన్మో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రూ. 112.21 కోట్ల‌తో 19.48 శాతం వాటాను కొనుగోలు చేసింది. పెద్ద ఎత్తున వ‌చ్చే ఆర్డ‌ర్స్‌ని సులువుగా హ్యాండిల్ చేయ‌డానికి రెస్టారెంట్స్ కి అర్బ‌న్ పైప‌ర్ సాఫ్ట్ ఫేర్ సేవ‌ల‌ను కూడా అందిస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది