Zomato | జొమాటో చేసిన పనికి నోరెళ్లపెట్టిన నెటిజన్స్.. ఏం ఆర్డర్ చేస్తే ఏం వచ్చిందంటే..!

#image_title
Zomato | హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేద్దామన్న ఆలోచన ఆయనకి షాక్ ఇచ్చింది. శుక్రవారం (సెప్టెంబర్ 12) ఆదిత్య ఇర్రి అనే యువకుడు జొమాటో ద్వారా కొండాపూర్‌లోని రైస్ బౌల్ రెస్టారెంట్ నుంచి కర్డ్ రైస్ ఆర్డర్ చేశాడు. అయితే ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే అతను షాక్‌కు గురయ్యాడు. అందులో వండని చికెన్ ముక్కలు, పైగా ఒక కాగితం కూడా కనిపించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు.

#image_title
సోషల్ మీడియాలో ఫిర్యాదు…
ఆదిత్య తన అనుభవాన్ని వెంటనే సోషల్ మీడియా (X) ద్వారా పోస్ట్ చేసి, జొమాటోతో పాటు జీహెచ్ఎంసీ (GHMC), తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ను ట్యాగ్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో GHMC తక్షణమే స్పందించింది. “ప్రియమైన ఆదిత్య, మీ ఫిర్యాదును గమనించాం. ఇది అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం” అని జీహెచ్ఎంసీ అధికారికంగా సమాధానమిచ్చింది.
జొమాటో కూడా స్పందిస్తూ కస్టమర్‌కు క్షమాపణలు చెప్పి, ఆర్డర్ వివరాలు షేర్ చేయమని కోరింది. ఇలాంటి ఫుడ్ డెలివరీ లోపాలు జొమాటోకు ఇదే మొదటి సారి కాదు. గత ఏడాది అక్టోబర్‌లో కొండాపూర్‌కు చెందిన అనన్య అనే విద్యార్థిని జొమాటో ద్వారా చికెన్ మంచూరియన్ ఆర్డర్ చేసింది. కానీ అందులో చికెన్ 65 వచ్చిందట. కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయగా, వారు “దయచేసి దానిని తీసుకోండి… మీకు ఇది నచ్చుతుందని అనుకుంటున్నాం” అని తేలికపాటి సమాధానమిచ్చారు. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.