BRS MLCS : కేసీఆర్‌కి భారీ షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వీళ్లే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BRS MLCS : కేసీఆర్‌కి భారీ షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వీళ్లే

 Authored By kranthi | The Telugu News | Updated on :6 December 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  శాసనమండలిలో బలం లేని కాంగ్రెస్

  •  ఆ 10 మంది ఎమ్మెల్సీల పార్టీ మార్పు ఖాయమేనా?

  •  ఆ ఎమ్మెల్సీలను బుజ్జగిస్తున్న కేసీఆర్

BRS MLCS : తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తెలంగాణలో నవ శకం ఆరంభమైందనే చెప్పుకోవాలి. తెలంగాణలో ఇప్పటి వరకు రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ చేతికి తెలంగాణ వచ్చింది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని ప్రకటించింది. ఆయన ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం, పలువురు మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు మంచి గుణపాఠం అనే చెప్పుకోవాలి. అయితే.. కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలిచి మ్యాజిక్ ఫిగర్ కంటే 4 ఎమ్మెల్యే సీట్లను ఎక్కువే సాధించింది. ఇక.. బీఆర్ఎస్ పార్టీ మాత్రం 39 సీట్లు మాత్రమే సాధించి అధికారానికి ఆమడ దూరంలో ఉండిపోయింది. ఒకరకంగా కేసీఆర్ కు ఇది భారీ షాక్ అనే చెప్పుకోవాలి. ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు రోజులు కూడా కాలేదు.. ఇంతలోనే కేసీఆర్ కు మరో షాక్ ఇస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.

ఒక్క ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా హస్తం వైపు చూస్తున్నారట. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లారట. గతంలో కాంగ్రెస్ పార్టీతో సాన్నిహిత్యం ఉన్న వాళ్లు, కేసీఆర్ పై వ్యతిరేకత ఉన్నవాళ్లు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. శాసనసభలో కాంగ్రెస్ కు మెజారిటీ ఉంది కానీ.. శాసనమండలిలో మాత్రం మెజారిటీ లేదు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ ఎర వేస్తోంది. పెద్దల సభలో చర్చకు వచ్చే బిల్లుల ఆమోదానికి ఇబ్బంది లేకుండా చూసుకోవడంపై కాంగ్రెస్ దృష్టి పెడుతోంది. దానికి కావాల్సిన సభ్యుల సంఖ్యపై కాంగ్రెస్ ఆరా తీస్తోంది. ప్రస్తుతం మండలిలో బీఆర్ఎస్ కు 35 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అందులో 10 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

BRS MLCS : 2014 సీన్ రివర్స్ అవుతోందా?

2014 లో కాంగ్రెస్ ను ఓడించి టీఆర్ఎస్ గెలిచాక.. కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్సీలను కేసీఆర్ తనవైపునకు లాక్కున్నారు. ఇప్పుడు 2023 లో ఆ సీన్ రివర్స్ అవబోతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ ఆకర్షిస్తోంది. వాళ్లకు ఎర వేస్తోంది. ఇది ముందే గ్రహించిన కేసీఆర్.. ఎమ్మెల్సీలను బుజ్జగించే పనిలో పడ్డారట. ఎంత బుజ్జగించినా 10 మంది ఎమ్మెల్సీలు మాత్రం వెంటనే కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. ఒకేసారి 10 మంది ఎమ్మెల్సీలు పార్టీ మారితే బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పడిపోయే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది