Acham Naidu : మంత్రి పదవి కోసమే ఆళ్ల ఆరాటం : అచ్చెన్నాయుడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Acham Naidu : మంత్రి పదవి కోసమే ఆళ్ల ఆరాటం : అచ్చెన్నాయుడు

 Authored By brahma | The Telugu News | Updated on :20 March 2021,2:30 pm

Acham Naidu : చంద్రబాబు నాయుడపై సీఐడీ పెట్టిన అక్రమ కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా వైసీపీ కళ్లు తెరవాలంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నాడు. రైతులెవరూ తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో రామకృష్ణారెడ్డి ఆఫీసులో పనిచేసే జాన్సన్ అనే వైసీపీ కార్యకర్త చేత తప్పుడు కేసులు సృష్టించారు. ఏ ఆధారం లేకుండానే చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. రుజువులు వుండి వుంటే నేడు కోర్టులో సీఐడీ ప్రవేశపెట్టేది.

Acham Naidu Fair On alla ramakrishna reddy

Acham Naidu Fair On alla ramakrishna reddy

నిత్యం రాజధానిపై నిందలు వేస్తూ అమరావతి బ్రాండ్ ను వైసీపీ దెబ్బ తీస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతులకు వైసీపీ తీరని ద్రోహం చేస్తోంది. నిరాధారమైన కేసులు వేయడం రాజశేఖర్ రెడ్డి కాలం నుండి వస్తోంది.అసైన్డ్ భూముల అక్రమాల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు.అసైన్డు రైతుల నుండి భూములు లాక్కున్న ఘనులు వైసీపీలో చాలా మంది ఉన్నారు. ఇళ్ల పట్టా పేరుతో 6 వేల ఎకరాల అసైన్డు భూములు గుంజుకుని కోట్లకు అమ్ముకున్నారంటూ అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగాడు.

Acham Naidu : ఆళ్ల విలక్షణ నటుడు

జీ.ఓ నంబర్ 41లో ఎలాంటి తప్పులు లేవు కాబట్టే హైకోర్టు స్టే ఇచ్చింది.వైసీపీ పెట్టిన అక్రమ కేసు కోర్టులో నిలబడదు. అర్ధం లేని ఫిర్యాదులు చేసి ప్రతిష్టను దిగజార్చాలనుకున్న వైసీపీ నేతలు మరోసారి ప్రజల్లో నవ్వుల పాలయ్యారు. రాజధానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని, తమ భూములు ఎవరూ లాక్కోలేదని సీఐడీ ఎదుట అసైన్డు రైతులు చెప్పారు. ఆళ్ల రామకృష్టారెడ్డి తన విలక్షణ నటనకు తెరదింపాలి. మంత్రిపదవి కోసం పడుతున్న ఆరాటం చూస్తే జాలేస్తోంది.

Acham Naidu Fair On alla ramakrishna reddy

Acham Naidu Fair On alla ramakrishna reddy

ఆళ్ల వేసిన కేసులు దళిత ప్రయోజనాల కోసమో.. వైసీపీ ప్రయోజనాల కోసమో తెలుసుకోలేని అమాయక స్థితిలో దళితులు లేరు. ఆర్కేకు చిత్తశుద్ధి వుంటే దళితులు అధికంగా ఉన్న అమరావతి నుండి రాజధాని మార్చి దళితులను మోసం చేయాలని చూస్తున్న జగన్ రెడ్డిపై కోర్టులో కేసులు వేయాలి. రైతులను బెదిరించి తప్పుడు ఫిర్యాదులు ఇప్పించాలని వైసీపీ ప్రయత్నించింది. కానీ రైతులు ప్రభుత్వ ఒత్తిడిలకు లొగ్గలేదు.తక్షణమే వైసీపీ రాజధాని రైతులకు, చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి.

కక్షలు, దౌర్జన్యాలు, అరాచకంతో జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. అహంకారంతో ప్రభుత్వం పంతానికి పోయి, తప్పులు సరిదిద్దుకొనే ప్రయత్నం చెయ్యకుండా సమస్యలు కొని తెచ్చుకొంటోంది. ప్రజా ప్రయోజనాలకు పెద్ద పీట వెయ్యాల్సిన ప్రభుత్వం స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు పెద్ద పీట వేయడం వల్లనే కోర్టులతో ప్రభుత్వం తలంటించుకోవాల్సి వచ్చింది అంటూ అచ్చెన్న విమర్శలు చేశాడు.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది