Ahmedabad Plane Crash : ఒక్కరూ బతికే ఛాన్స్ లేదు – 242 చనిపోయి ఉంటారు అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ ప్ర‌క‌ట‌న‌..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ahmedabad Plane Crash : ఒక్కరూ బతికే ఛాన్స్ లేదు – 242 చనిపోయి ఉంటారు అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ ప్ర‌క‌ట‌న‌..?

 Authored By ramu | The Telugu News | Updated on :12 June 2025,6:39 pm

ప్రధానాంశాలు:

  •  Ahmedabad Plane Crash : ఒక్కరూ బతికే ఛాన్స్ లేదు - అహ్మదాబాద్ సీపీ

  •  Ahmedabad Plane Crash : ఒక్కరూ బతికే ఛాన్స్ లేదు - 242 చనిపోయి ఉంటారు అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ ప్ర‌క‌ట‌న‌..?

Ahmedabad Plane Crash : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్.. టేకాఫ్ అయినా కొద్దీ నిమిషాల్లోనే రెసిడెన్షియల్ ప్రాంతంలో కూలింది. ఈ ప్రమాద మరణాలపై అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి ఉండే ఛాన్స్ లేదని అసోసియేటెడ్ ప్రెస్ (AP) అనే అంతర్జాతీయ మీడియా సంస్థతో తెలిపారు. మృతుల్లో స్థానికులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం ఈ విమానంలో సిబ్బంది, పైలట్లు సహా మొత్తం 242 మంది ఉన్నారు.

Ahmedabad Plane Crash ఒక్కరూ బతికే ఛాన్స్ లేదు 242 చనిపోయి ఉంటారు అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ ప్ర‌క‌ట‌న‌

Ahmedabad Plane Crash : ఒక్కరూ బతికే ఛాన్స్ లేదు – 242 చనిపోయి ఉంటారు అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ ప్ర‌క‌ట‌న‌..?

Ahmedabad Plane Crash ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో మొత్తం ప్రయాణికులు చనిపోయారు

మృతుల్లో కొందరు స్థానికులు కూడా ఉన్నారని సీపీ పేర్కొన్నారు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే మేఘనినగర్ సమీపంలో విమానం కూలిపోయింది. ప్రమాదం తీవ్రతకు తగిన సూచనగా మంటలు చెలరేగడంతో విమానం పూర్తిగా కాలిబూడిదైపోయింది. శరీరాలు గుర్తుపట్టలేనంతగా దెబ్బతిన్నాయి.

ఇప్పటికే ఘటనాస్థలికి అత్యవసర సేవల బృందాలు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఆసుపత్రులకు తరలించే పనులు కొనసాగుతున్నాయి అని పేర్కొన్నారు. ఈ సంఘటనపై కేంద్రం సీరియస్‌గా స్పందించింది. గుజరాత్ సీఎం, కేంద్ర మంత్రి, PMO అధికారులు దీనిపై సమీక్ష చేస్తున్నారు. విమాన ప్రమాదానికి గల అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి