Allu Arjun : ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ వార్నింగ్.. అలాంటి పనులు చేస్తే సహించేది లేదు..!
ప్రధానాంశాలు:
Allu Arjun : ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ వార్నింగ్.. అలాంటి పనులు చేస్తే సహించేది లేదు..!
Allu Arjun : ఓ పక్క పుష్ప 2 వసూళ్లతో సరికొత్త సంచలన రికార్డులు క్రియేట్ చేస్తుంటే మరోపక్క అల్లు అర్జున్ మాత్రం లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారని తెలిసిందే. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన సంఘటన వల్ల ఇప్పటికే అల్లు అర్జున్ ఒక పూట జైలుకు వెళ్లొచ్చాడు. అయితే నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడిన తీరు అల్లు అర్జున్ మళ్లీ జైలుకు పంపించేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి తన వ్యక్తిగతంగా తనపై రాంగ్ ఎలిగేషన్స్ చేస్తున్నారు అని అన్నాడు. వ్యవహారం మరింత ముదురుతుంది అనిపిస్తున్న ఈ టైం లో తన ఫ్యాన్స్ కి సోషల్ మీడియా వేదిక ద్వారా వార్నింగ్ ఇచ్చాడు అల్లు అర్జున్.
Allu Arjun ఎలాంటి వివాదాలను లేపినా కూడా దానికి అల్లు అర్జునే పూర్తి బాధ్యత..
ఫ్యాన్స్ ఎవరు ఈ టైం లో ఎలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని.. బాధ్యతాయుతంగా ఉండాలని వ్యక్తిగత కామెంట్స్ చేయొద్దని అన్నారు. అంతేకాదు తన ఫ్యాన్స్ ముసుగులో కొందరు కావాలని ఫేక్ ఐడీస్ తో కామెంట్స్ చేస్తున్నారు అని అలాంటి వాటికి అసలు స్పందించొద్దని అన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు అల్లు అర్జున్.అల్లు అర్జున్ పెట్టిన ఈ మెసేజ్ చూస్తే వ్యవహారంలో ఫ్యాన్స్ ని లాగకూడదు అంతేకాకుండా దీని వల్ల పరిస్థితి ఇంకా సీరియస్ అవకూడదనే ఉద్దేశంతో అలా చెప్పాడని అనుకుంటున్నారు.
అంతేకాదు ఈ టైం లో ఫ్యాన్స్ ఎలాంటి వివాదాలను లేపినా కూడా దానికి అల్లు అర్జునే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే ముందస్తు జాగ్రత్తగా అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కి విన్నవించుకున్నాడు. ఐతే తన ఫ్యాన్స్ గా ఫేక్ ఐడీలు పెట్టుకుని వ్యతిరేక కామెంట్స్, ఎలిగేషన్స్ చేస్తున్న వారి పట్ల కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ ని ఈ ఇష్యూ ఇప్పుడప్పుడే వదిలేలా లేదనిపిస్తుంది Allu Arjun, Allu Arjun Warning, Fans, Pushpa 2 ,