PM Modi Amaravati : ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్ రూపుదాల్చుతోంది – మోడీ
ప్రధానాంశాలు:
PM Modi Amaravati : ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్ రూపుదాల్చుతోంది - మోడీ
PM Modi Amaravati : అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం తెలుగు ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపింది. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని.. “అమరావతి స్వప్నం సాకారమవుతోంది. చారిత్రక పరంపర, ప్రగతి కలిపి పయనిస్తున్నట్లు కనిపిస్తోంది” అంటూ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిపై మాట్లాడే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. బౌద్ధ వారసత్వం కలిగిన అమరావతి ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి చిహ్నంగా మారుతుందని అన్నారు.

PM Modi Amaravati : ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్ రూపుదాల్చుతోంది – మోడీ
PM Modi Amaravati పెద్ద పెద్ద పనులు పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు : ప్రధాని మోడీ
“అమరావతి ఒక నగరం కాదు, అది ఒక శక్తి” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక రాష్ట్రంగా మారుస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇది కేవలం శంకుస్థాపన కార్యక్రమం మాత్రమే కాక, స్వర్ణాంధ్ర నిర్మాణానికి శుభ సంకేతమని వివరించారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం అందించనుందని, రికార్డు వేగంతో నిర్మాణాలు సాగేందుకు అన్ని విధాలా తోడ్పాటిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఆంధ్రవాసి కలలకి అమరావతి రూపకల్పన అవుతుందని తెలిపారు.
చంద్రబాబు టెక్నాలజీ వినియోగం గురించి మాట్లాడిన సందర్భంగా.. మోదీ కూడా తన అనుభవాలను పంచుకున్నారు. గుజరాత్ సీఎం కాలంలోనే చంద్రబాబు టెక్నాలజీ వినియోగాన్ని గమనించి నేర్చుకున్నానని చెప్పారు. అమరావతి పునర్నిర్మాణం కేవలం ఒక ప్రాంత అభివృద్ధి మాత్రమే కాక, వికసిత్ భారత్ ఆశయాలకు బీజం వంటిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రానికి అభివృద్ధి దిశగా కేంద్రం పూర్తి సహకారం ఉంటుందని ప్రజలకు నమ్మకాన్ని కలిగించాయి.