
#image_title
Anil Kumar Yadav : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ. టీడీపీ నేతలు అయితే చంద్రబాబు అరెస్ట్ పై భగ్గుమంటున్నారు. ఏపీ వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. కానీ.. టీడీపీ నేతలను నిరసన తెలపకుండా ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోవైపు వైసీపీ నేతలు అయితే చంద్రబాబు అరెస్ట్ పై పండుగ చేసుకుంటున్నారు. ఆయన్ను ఏకిపారేస్తున్నారు. చంద్రబాబు ఇది నీకు కావాల్సిందే.. అంటూ ఫైర్ అవుతున్నారు. తాజాగా నెల్లూరు ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ కాగానే నిన్న కాక మొన్న పార్టీలోకి వెళ్లిన కోటంరెడ్డి తెగ హడావుడి చేస్తున్నాడని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై అనీల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుని ఒక స్కామ్ లో 370 కోట్లకు సంబంధించి పచ్చిగా దొరికిపోయాడు. ఏదైతే 90 శాతం పెట్టాల్సిన సీమెన్స్.. రూపాయి కూడా పెట్టలేదు సీమెన్స్. ఏం చేయకపోయినా నేరుగా 370 కోట్లు వాళ్ల బ్యాంకులకు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ఆ తర్వాత పంచుకున్నారు. అడ్డంగా దొరికి 13 చోట్ల సంతకాలు పెట్టి మేమెక్కడా సంతకాలు పెట్టలేదు.. మాకు ఆధారాలు లేవు అని చెబుతున్నారు.
ఈరోజు వాళ్లే చెబుతున్నారు. జ్యుడిషియల్ ను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. అలాంటి వ్యక్తికి ఈరోజు స్పష్టంగా దొరికిపోయాడు కాబట్టే ప్రజల నుంచి, న్యాయ స్థానం దగ్గర్నుంచి తప్పకుండా దీంట్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. చంద్రబాబు తప్పు చేశారని తెలిసిపోతోంది. టీడీపీలో ఉన్న వాళ్లంతా అర్థం చేసుకున్నారు చాలావరకు. కానీ.. పాపం మా జిల్లాల్లో వైసీపీ నుంచి జంప్ జలానీలు ఉన్నారు. వాళ్ల హడావుడి ఎక్కువైపోయింది. రాంనారాయణరెడ్డి, శ్రీధర్ రెడ్డి హడావుడి చూస్తుంటే ఇక తెలుగుదేశంలోనే పుట్టి పెరిగి చంద్రబాబు కోసం పని చేసిన వాళ్ల కంటే ఎక్కువ హడావుడి చేస్తున్నారు వీళ్లు. టీడీపీ వాళ్లే ఏదో ఒక గంట పేరుకు నిరసన చేసి ప్రెస్ తో మాట్లాడి చాప చుట్టేస్తున్నారు. వీళ్ల బాధేంది అని టీడీపీ నేతలే ఈరోజు అన్నీ మూసుకొని ఉంటున్నారు. శ్రీధర్ రెడ్డిని మూడు నాలుగు రోజుల నుంచి చూస్తున్నా. ప్రశాంత్ కిషోర్ ఫోన్ చేస్తే ఎవరో పారిశ్రామిక వేత్తకు ఫోన్ చేస్తే ఈయన పక్కన ఉన్నారట. ఎవరయ్యా పారిశ్రామికవేత్త. 2024 ఎన్నికల్లో ఎవరికి అహం పెరిగింది.. ఎవరికి బలుపు వచ్చందో, వాపు వచ్చిందో ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తారన్నారు.
#image_title
తండ్రి జైలులో ఉంటే కొడుకు లోకేష్ పరారయ్యాడు. ఢిల్లీకి వెళ్లిపోయాడు. ఆయనకే తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకే తెలుసు. అన్నీ తెలిసి ఢిల్లీకి పారిపోయాడు. ఢిల్లీలో అదే నలుగురు ఎంపీలతో తిరుగుతున్నాడు. ఏమున్నది అక్కడ చర్చించడానికి. 20 రోజులు అయింది ఢిల్లీ పరార్. ఇది మీ పరిస్థితి. ఈ వయసులో ఆయన్ను ఇబ్బంది పెడుతున్నారట. ఈ వయసులో ఆయన తప్పు చేయొచ్చా? ఆ వయసులో తప్పు చేస్తే వదిలేస్తారా? అని అనీల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
This website uses cookies.