Union Budget 2025 : AI ఏఐ కోసం భారీ బడ్జెట్ కేటాయించిన కేంద్రం.. ఏఐ లక్ష్యంగా సెంటర్స్ ఏర్పాటు
ప్రధానాంశాలు:
Union Budget 2025 : AI ఏఐ కోసం భారీ బడ్జెట్ కేటాయించిన కేంద్రం.. ఏఐ లక్ష్యంగా సెంటర్స్ ఏర్పాటు
Union Budget 2025 : బడ్జెట్‌లో కేంద్రం గుడ్ న్యూస్‌లు ప్రకటిస్తుంది.విద్యారంగం, విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ nirmala sitharaman ప్రకటించారు. యువకులలో ఉత్సుకత, ఆవిష్కరణలతో పాటు శాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహించడానికి, వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

Union Budget 2025 : AI ఏఐ కోసం భారీ బడ్జెట్ కేటాయించిన కేంద్రం.. ఏఐ లక్ష్యంగా సెంటర్స్ ఏర్పాటు
Union Budget 2025 ప్రత్యేక శ్రద్ధ
బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ విద్యార్థులకు కీలక ప్రకటనలు చేశారు. ఐఐటీలో 6500 సీట్లు పెంచుతామని ఆయన అన్నారు. 3 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాలు ప్రారంభించించనుంది కేంద్ర ప్రభుత్వం. 5 సంవత్సరాలలో వైద్యరంగంలో 75000 మెడికల్ సీట్లు పెంచుతామని స్పష్టం చేశారు. AI విద్యకు 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు.
అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులు దిద్దనున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు, అన్ని ప్రభుత్వ హైస్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనున్నారు. టెక్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న భారత్ పాత్రని దృష్టిలో ఉంచుకొని దాదాపు 6500 మంది అదనపు విద్యార్ధులకి ఐఐటీలో మౌలిక సదుపాయాలు విస్తరించాలని అనుకుంటున్నారు.