Vikram Misri : ట్రంప్ చెప్పిందంతా అబద్దమే : విక్రమ్ మిస్రీ.. వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vikram Misri : ట్రంప్ చెప్పిందంతా అబద్దమే : విక్రమ్ మిస్రీ.. వీడియో..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 June 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Vikram Misri : ట్రంప్ చెప్పిందంతా అబద్దమే : విక్రమ్ మిస్రీ.. వీడియో..!

Vikram Misri  : పాకిస్థాన్‌తో జరిగిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఒప్పందంలో అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. భారత్, పాకిస్థాన్ సైన్యాల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారానే ఈ ఒప్పందం కుదిరిందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వచ్చిన ఊహాగానాలను ఖండించారు. భారత్ ఆమోదించిన ఈ కాల్పుల విరమణ ఎప్పుడూ మూడో పార్టీల జోక్యం వల్ల జరగదని ఆయన అన్నారు.

Vikram Misri ట్రంప్ చెప్పిందంతా అబద్దమే విక్రమ్ మిస్రీ

Vikram Misri : ట్రంప్ చెప్పిందంతా అబద్దమే – విక్రమ్ మిస్రీ

Vikram Misri  : ట్రంప్ చెపితే మీము ఆపరేషన్ ఆపలేదు – విక్రమ్ మిస్రీ

భారత ఆర్మీ కఠినంగా ప్రతిస్పందించడంతో పాకిస్థాన్ వెనక్కి తగ్గిందని మిస్రీ స్పష్టం చేశారు. భారత్ నిర్దాక్షిణ్యంగా ఉగ్రవాదానికి తగిన బుద్ధి చెప్పడంతో పాక్ ఒత్తిడికి లోనై సీజ్‌ఫైర్‌కు సిద్ధపడిందని చెప్పారు. ఇదే సమయంలో అమెరికా ట్రేడ్ డీల్ లేదా ఇతర ఒత్తిళ్ల వల్ల భారత్ తన నిర్ణయాలను తీసుకునే దేశం కాదని మిస్రీ తెలిపారు. భారత్‌కు దేశ భద్రతకే ప్రాధాన్యత ఉంటుందని, అంతర్గత విధానాలపై పూర్తి నిశ్చయంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

భారత్ ఎప్పుడూ శాంతికి పునాది వేసే దేశమని, కానీ ఏ దాడినైనా తీవ్రంగా ఎదుర్కొనగల శక్తి మనకు ఉందని మిస్రీ తెలిపారు. గతంలో పుల్వామా తర్వాత జరిగిన యుద్ధసన్నాహాలు, ఆపై బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్‌లు ఇందుకు నిదర్శనమన్నారు. సీజ్‌ఫైర్ నిర్ణయం పూర్తిగా స్వేచ్ఛాత్మకంగా, ఇరుదేశాల చర్చల ద్వారానే తీసుకున్నదని, ఇందులో విదేశీ దేశాల జోక్యం అస్సలు లేదని మిస్రీ స్పష్టంగా వెల్లడించారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి