AP Volunteers : వాలంటీర్లే రథ సారథులు .. జగన్ స్పీచ్ అదరహో !
AP Volunteers : ఏపీలో ఇప్పటి వరకు ఎవ్వరూ ప్రవేశపెట్టని, తీసుకురాని వ్యవస్థను సీఎం జగన్ తీసుకొచ్చారు. నిజానికి ఏ రాష్ట్రం కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు. అదే వాలంటీర్ల వ్యవస్థ. ఏపీలో ప్రతి మారుమూల గ్రామానికి, మారుమూల ఇళ్లకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయి అంటే దానికి కారణం వాలంటీర్ల వ్యవస్థ. ఏపీలో ప్రస్తుతం రెండున్నర లక్షలకు పైనే వాలంటీర్లు పనిచేస్తున్నారు. వాళ్లంతా అసలైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారు. అందుకే వాలంటీర్లందరికీ వందనం పేరుతో సీఎం జగన్ ఒక కార్యక్రమాన్ని తాజాగా నిర్వహించారు.
అందుకే ఏపీలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు, సారథులు వాలంటీర్లే అని చెప్పడానికి గర్వపడుతున్నానని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అవ్వతాతకు మనవడు, మనవరాలిగా సేవలు అందిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 64 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వ పెన్షన్ ను సరైన సమయానికి అందిస్తూ వాళ్లకు తోడుగా ఉంటున్నారు వాలంటీర్లు అంటూ సీఎం జగన్ కొనియాడారు.
AP Volunteers : 2019 నుంచి ఏపీ ప్రజలకు 2.66 లక్షల మంది మహాసైన్యం సేవలు
2019 నుంచి 2.66 లక్షల మంది వాలంటీర్లు ఏపీ ప్రజలకు మహా సైన్యంలా సేవలందిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని వాలంటీర్ల వ్యవస్థ మనది. వాలంటీర్ల ద్వారా ప్రజలకు మంచిని అందించే కార్యక్రమం అది. వాలంటీర్ల ద్వారానే డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా రూ. 3లక్షల కోట్ల నిధులను ప్రజలకు అందిస్తున్నారు. ఇది పేదల ప్రభుత్వం. పేదలకు మంచి చేసే ప్రభుత్వం. నిజాలను మాత్రమే ప్రజలకు వివరించే సత్య సారథులు వాళ్లు. ప్రతి ఇంటికి నేరుగా వెళ్లగలిగే వాలంటీర్ల వ్యవస్థ అది. ప్రభుత్వ ఉద్యోగులు కాదు వాళ్లు. స్వచ్ఛందంగా మంచి చేయాలనే తపన, తాపత్రయం వాళ్లలో ఉంది.. ప్రభుత్వ సేవకు వాళ్లంతా దన్నుగా నిలుస్తున్నారు అని సీఎం జగన్ కొనియాడారు.