AP Governor : ఏపీ మొత్తం ఉలిక్కిపడే వార్త.. 40 రోజుల తర్వాత చంద్రబాబు అరెస్ట్‌పై గవర్నర్ సంచలన నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Governor : ఏపీ మొత్తం ఉలిక్కిపడే వార్త.. 40 రోజుల తర్వాత చంద్రబాబు అరెస్ట్‌పై గవర్నర్ సంచలన నిర్ణయం

 Authored By kranthi | The Telugu News | Updated on :19 October 2023,3:00 pm

AP Governor : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ఇప్పటికీ టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా టీడీపీ కీలక నేతల బృందం ఏపీ గవర్నర్ ను కలిశారు. నిజానికి చంద్రబాబును 17ఏ సెక్షన్ కింద గవర్నర్ ను సంప్రదించుకుండా సీఐడీ అధికారులు ఏకపక్షంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ గవర్నర్ ను కలిశారు టీడీపీ నేతలు. గవర్నర్ ను కలిసి 50 పేజీల రిపోర్ట్ ను అందించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు నుంచి ఏదైతే అమరావతిలో కాన్ఫరెన్స్ హాల్ పగులగొట్టినప్పటి నుంచి చంద్రబాబును అరెస్ట్ చేసినంత వరకు ప్రతి విషయాన్ని స్పష్టంగా గవర్నర్ కు అందజేశారు.

అన్ని విషయాల మీద పరిశీలన చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని గవర్నర్ దృష్టిలో పెట్టాం. నాకు ఎంత వరకు అధికారం ఉందో, ఏ విధంగా చేయగలనో.. తప్పనిసరిగా చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని అచ్చెన్నాయుడు చెప్పారు. రాజ్యాంగ సంస్థలు అన్నింటిపైనా నాశనం చేసి ఈ రాష్ట్రంలో పూర్తిగా రాజ్యాంగం లేకుండా పాలన సాగిస్తున్నారన్నారు. నా మీద కేసు పెట్టినప్పటి నుంచి చంద్రబాబు వరకు కొన్ని వందల మంది మీద సీఐడీని ఉపయోగించి కేసులు పెట్టారన్నారు. ఒక్క కేసులో అయినా సరే.. ఒక చిన్న ఆధారం కూడా సంపాదించలేకపోయారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల మీద దాడులు చేశారు. దేవాలయాల మీద దాడులు చేశారు. అమరావతిని నాశనం చేశారు. అన్ని విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ap governor sensational decision on chandrababu arrest

AP Governor : చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారు?

ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారు. చంద్రబాబును దారుణంగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో బంధించారు. నిరంతరం ప్రజల్లో ఉండి పోరాటం చేసే నాయకుడిని ఒక ఉగ్రవాదిలా అరెస్ట్ చేసి దారుణంగా వ్యవహరించారు. ఎందుకు అరెస్ట్ చేశారు.. చేసిన తప్పేంటి.. ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగితే.. ముందు అరెస్ట్ చేస్తున్నాం.. దర్యాప్తు చేసి ఆధారాలు చెబుతాం అన్నారు. అరెస్ట్ చేసి 40 రోజులు అయింది.. ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. గవర్నర్ కి వాస్తవాలు చెప్పాం. మా నాయకుడిపై మూడు కేసులు పెట్టారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసును చంద్రబాబు మీద పెట్టారు అన్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది