Chandrababu Interim Bail : చంద్రబాబు బెయిల్.. సాయంత్రం 4 గంటలకు జైలు నుంచి రిలీజ్.. సాయంత్రం దాకా ఎందుకు రిలీజ్ చేయడం లేదంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu Interim Bail : చంద్రబాబు బెయిల్.. సాయంత్రం 4 గంటలకు జైలు నుంచి రిలీజ్.. సాయంత్రం దాకా ఎందుకు రిలీజ్ చేయడం లేదంటే?

 Authored By kranthi | The Telugu News | Updated on :31 October 2023,12:00 pm

ప్రధానాంశాలు:

  •  బెయిల్ వచ్చినా సాయంత్రం దాకా విడుదల కాని చంద్రబాబు

  •  సెంట్రల్ జైలు నుంచి సాయంత్రం తర్వాత విడుదల

  •  టీడీపీ శ్రేణుల సంబురాలు షురూ

Chandrababu Interim Bail : టీడీపీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నారు. దాదాపు 52 రోజుల తర్వాత చంద్రబాబు జైలు నుంచి ఇవాళ విడుదల కాబోతున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు, నేతల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇక.. నందమూరి, నారా ఫ్యామిలీ కూడా సంబురాలు చేసుకుంటున్నారు. ఎట్టకేలకు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టు ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబును తీర్పు రాగానే విడుదల చేయడం లేదు. దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సాయంత్రం 4 గంటలకు అధికారులు విడుదల చేయనున్నారు.

హైకోర్టు తీర్పు అయితే చెప్పింది కానీ.. ఇంకా ఆ ఉత్తర్వులు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు అందలేదు. అవి అందడానికి కొంత సమయం పడుతుంది. అందుకే చంద్రబాబు రిలీజ్ ఆలస్యం కానుంది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. అవి రాజమండ్రి సెంట్రల్ జైలుకు అందగానే వెంటనే చంద్రబాబును రిలీజ్ చేయనున్నారు. చంద్రబాబును రిసీవ్ చేసుకోవడం కోసం నారా ఫ్యామిలీ మొత్తం రాజమండ్రిలోనే ఉంది. నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి అందరూ రాజమండ్రిలోనే ఉన్నారు. ఇక.. టీడీపీ శ్రేణులు కూడా వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకుంటున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎయిర్ పోర్ట్ వరకు చంద్రబాబు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకుంటారు. చంద్రబాబుకు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది.

సోమవారమే ఇరు వైపుల వాదనలను విన్న హైకోర్టు.. ఇవాళ తీర్పు వెల్లడించింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. చంద్రబాబు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆయన కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్టు ఈ బెయిల్ మంజూరు చేసింది. మళ్లీ నవంబర్ 24న చంద్రబాబు కోర్టుకు సరెండర్ కావాల్సి ఉంటుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రధాన బెయిల్ పై వచ్చే నెల అంటే నవంబర్ 10న కోర్టు విచారణ జరుపనుంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది