YS Jagan : మీ ఇంట్లో టెన్త్, ఇంటర్ ఫైల్ అయినవాళ్ళు ఉన్నారా ? వాళ్లకి జగన్ సూపర్ న్యూస్ చెప్పాడు !
YS Jagan : కరోనా వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు కానీ.. విద్యార్థులు మాత్రం సేఫ్ అయ్యారు. ఎందుకంటే.. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పాస్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం విద్యార్థుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని పరీక్షలు రాయకుండానే పాస్ చేసింది. తాజాగా ఏపీకి చెందిన విద్యార్థులకు మరో బంపర్ ప్రకటించింది. అవును.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఏపీలో చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని చూస్తున్నాం కదా. అది నిజంగా చాలా విషాదం. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు కేవలం పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని, ఫెయిల్ అయ్యామని ఆత్మహత్య చేసుకోవడాన్ని నివారించేందుకు ఫెయిల్ అయిన విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
పదో తరగతిలో ఫెయిల్ అయినా.. ఇంటర్ లో ఫెయిల్ అయినా.. చివరకు సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయినా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. వాళ్లు తదుపరి సంవత్సరం కాలేజీలో చేరి.. తరగతులకు హాజరు అవుతూనే పరీక్షలు రాసుకోవచ్చు. ఇంతకుముందు ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ పాస్ అయ్యాకనే తదుపరి క్లాస్ కు హాజరయ్యేవారు. కానీ.. ఇప్పుడు అలా లేదు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
YS Jagan : ఫెయిల్ అయిన సబ్జెక్టులతో పాటు ఇతర సబ్జెక్టులు కూడా చదవాలి
ఫెయిల్ అయిన విద్యార్థులకు వాళ్లు ఏ సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారో ఆయా సబ్జెక్టుల క్లాసులతో పాటు తర్వాతి తరగతి సబ్జెక్టులు కూడా చదవాల్సి ఉంటుంది. వాటిని కూడా బోధిస్తారు. ఫెయిల్ అయిన సబ్జెక్టులు, కొత్త సబ్జెక్టులు అన్నీ కలిపితే కొంచెం ఎక్కువే అవుతాయి కానీ.. వాళ్లకు విద్య సంవత్సరం వేస్ట్ కాకుండా ఉంటుంది. అందుకే ఏపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా క్లాసులకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు కంపార్ట్ మెంటల్ పాస్ అని కాకుండా సర్టిఫికెట్ లో రెగ్యులర్ పాస్ అనే ఇవ్వనున్నారు. అందుకే.. ఫెయిల్ అయిన విద్యార్థులు ఇక ఏమాత్రం టెన్షన్ పడకండి. ఏం చక్కా కాలేజీకి వెళ్లి చదువుకుంటూనే పరీక్షలు రాయండి.