AP People : ప్రజల్లో ఆ భయం.. చంద్రబాబు అ’భయం’.. మరో పదేళ్లు ఇస్తే తప్ప ఏమీ చేయలేరా..?
ప్రధానాంశాలు:
AP People : ప్రజల్లో ఆ భయం.. చంద్రబాబు అ'భయం'.. మరో పదేళ్లు ఇస్తే తప్ప ఏమీ చేయలేరా..?
AP People : పదేళ్ల క్రితం రెండుగా చీలిన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణాలో పదేళ్లు ఉద్యమ పార్టీ టీ.ఆర్.ఎస్ గెలగ్వగా మూడోసారి కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు ప్రజలు. ఇక ఆంధ్రా పరిస్థితికి వస్తే 2014లో టీడీపీకి ఛాన్స్ ఇచ్చిన ఏపీ ప్రజలు 2019 లో వైసీపీని గెలిపించారు. అయితే 2014 లో గెలిచిన ఏపీకి అమరావతిని క్యాపిటల్ చేస్తూ బాబు పనులు మొదలు పెట్టారు. ఐతే వైసీపీ ప్రభుత్వం ఆ పనులను ఆపేసింది. మూడు క్యాపిటల్స్ అంటూ హడావిడి చేశారు తప్ప వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. మళ్లీ వైసీపీ వస్తే వైజాగ్ ని క్యాపిటల్ గా చేయాలనే ఆలోచన చేశారు.
AP People మళ్లీ మార్చే ఛాన్స్ ఉందా.. అలా జరిగితే..
ఐతే 2024 లో కూటమి అధికారంలోకి వచ్చింది. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబు మళ్లీ ఏపీ క్యాపిటల్ ని అమరావతినే అంటూ పనులు మొదలు పెట్టాడు. ఫారినర్స్ నుంచి ఇన్వెస్ట్ మెంట్ కూడా చేయిస్తున్నాడు.ఏపీలో ప్రస్తుతం కూటమి ఉంది కాబట్టి అమరావతి ని క్యాపిటల్ ఫైనల్ చేశారు. మళ్లీ వైసీపీ వచ్చి కాదు విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేస్తా అంటే మళ్లీ ప్రజలు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది.
అందుకే బాబు ఈ టర్మ్ మొత్తం లో క్యాపిటల్ ని మళ్లీ మార్చకుండా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నాడు. అంతేకాదు ఒకవేళ క్యాపిటల్ కాస్త వెనక ముందు అయినా మళ్లీ ఏపీలోనే బాబు సీఎం అయితే తప్ప అది కొనసాగే అవకాశం లేదు. అందుకే ప్రజల్లో ఉన్న ఆ భయానికి చంద్రబాబు అభయం ఇస్తే తప్ప పని జరిగేట్లు లేదు. ఇలా జరగాలంటే మాత్రం 2029 లో కూడా మళ్లీ ఈ ప్రభుత్వమే రావాల్సి ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలంటే ఒక సీఎం కట్టడం మరో సీఎం కూల్చేయడం అన్నట్టు కాకుండా రాష్ట్రం బాగుపడేలా పనులు ఉండాలని అంటున్నారు.