Venu Swamy : గుడివాడ అమర్నాథ్ గెలవడం కష్టమే... వేణు స్వామి...!
Venu Swamy : ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు నువ్వా నేనా అని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో పోటీీ పడుతుంటే మరోవైపు రాజకీయ నాయకుల భవిష్యత్తును బయటపెడుతూ జ్యోతిష్య పండితులు వేణు స్వామి సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎవరు గెలుస్తారు అనే విషయాలను బయటపెట్టిన వేణు స్వామి తాజాగా మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణు స్వామి…వైసీపీ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతల గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే యాంకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి జగన్ వైపు దూసుకొస్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో జగన్ గారు విజయం సాధిస్తారని మీరు చెబుతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో సర్వేలు మాత్రం పరిణామాలు వేరే లాగా ఉన్నాయని చెబుతున్నాయి.
Venu Swamy : గుడివాడ అమర్నాథ్ గెలవడం కష్టమే… వేణు స్వామి…!
దీనికి మీరు ఏమంటారు అని అడుగగా… దానికి వేణు స్వామి సమాధానం ఇస్తూ వాటన్నింటిని నేను పట్టించుకోనని తెలియజేశారు. వాటిని చూసి నమ్మితే నేను కూడా రివ్యూ ఇచ్చేవాడిని అవుతా లేకపోతే పొలిటికల్ ఎనలిస్ట్ అవుతా కాని జ్యోతిష్యడు ఎందుకు అవుతా అంటూ చెప్పుకొచ్చారు. నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారమే వాస్తవాలు మాట్లాడతా… నేను చెప్పినవి నెగిటివ్ గా వచ్చిన పాజిటివ్ గా వచ్చిన నేను పట్టించుకోను. నేను చెప్పాలనుకున్నది చెప్తా..కానీ రివ్యూలను చూసి సర్వేలను చూసి నేను జ్యోతిష్యం చెప్పనంటూ ఈ సందర్భంగా వేణు స్వామి తెలియజేశారు.
Venu Swamy : గుడివాడ అమర్నాథ్ గెలవడం కష్టమే… వేణు స్వామి…!
నేను చెప్పే ప్రతి విషయం జాతకం పై ఆధారపడి ఉంటుంది కానీ సర్వేలు గ్రౌండ్ రియాల్టీ పై ఆధారపడి ఉండవని తెలిపారు. ఈ క్రమంలోనే వేణు స్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో వైసీపీ మంత్రి రోజా గారికి , అంబటి రాంబాబు గారిది ,మినిస్టర్ అమర్నాథ్ గారిది చాలా టఫ్ గా నడిచే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ ముగ్గురుది టంకాపోరు నడుస్తుంది కానీ ఓడిపోతారని నేను చెప్పడం లేదంటూ వేణు స్వామి తెలిపారు.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్‌కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.