Categories: ExclusiveNewspolitics

Ayyannapatrudu : ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం ఎన్నిక‌..!

Ayyannapatrudu : ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ గా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయిన‌ట్టు ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రకటన చేశారు.. ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ పక్షనేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. నవ్యాంధ్రప్రదేశ్‌ 3వ శాసనసభా సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ దూరంగా ఉన్నారు. అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. ఆయనకు నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం ఉంది.

Ayyannapatrudu : ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం ఎన్నిక‌

Ayyannapatrudu అయ్య‌న్న‌కి స్పీక‌ర్ ప‌దవి..

చంద్రబాబు… స్పీకర్ ఎన్నికను ఉద్దేశించి మాట్లాడారు. అయ్యన్నపాత్రుడి ప్రస్థానంపై ప్రశంసలు గుప్పించారు. అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమని చంద్రబాబు అన్నారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అయ్యన్న అని కొనియాడారు. ఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచి ప్రజాసేవలో ఉన్నారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అయ్యన్న తనదైన ముద్రవేశారన్న చంద్రబాబు…. విశాఖ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని చెప్పారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంటే ఉన్నారు.

1983లో తొలిసారిగా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఇప్పటి వరకూ ఏడుసార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి 24,676 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ మీద విజయం సాధించారు. తన రాజకీయ జీవితంలో మంత్రిగా, ఎంపీగానూ పనిచేసిన అయ్యన్నపాత్రుడు.. స్పీకర్ పదవిని అలంకరించారు.ఇప్ప‌డు స్పీక‌ర్ ప‌దవితో ఆయ‌న యాక్టివ్ రాజ‌కీయాల‌కి దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఉత్తరాంధ్రకే చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్ గా వ్యవహరించారు. ఈసారి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అయ్యన్నపాత్రుడికే స్పీకర్ ఛైర్ దక్కడం విశేషం

Recent Posts

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

1 hour ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

3 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

4 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

5 hours ago

Periods | పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయకూడదా.. వైద్య నిపుణులు సూటిగా చెప్పే సత్యం ఇదే..!

Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయరాదు,…

6 hours ago

Weight | బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా చదవాల్సిన వార్త.. అరటిపండు,యాపిల్‌ల‌లో ఏది బెస్ట్‌

Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…

7 hours ago

Liver Cancer | కాలేయ క్యాన్సర్ పై అవగాహన పెంపు అవసరం.. ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు

Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…

8 hours ago

Navaratri | నవరాత్రి ప్రత్యేకం: అమ్మవారికి నైవేద్యం సమర్పించడంలో పాటించాల్సిన నియమాలు

Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…

9 hours ago