Balakrishna : బాలకృష్ణ కూతుళ్లు, అల్లుళ్ల ఆస్తులకి సంబంధించి బయటకు వచ్చిన సీక్రెట్..!
ప్రధానాంశాలు:
Balakrishna : బాలకృష్ణ కూతుళ్లు, అల్లుళ్ల ఆస్తులకి సంబంధించి బయటకు వచ్చిన సీక్రెట్..!
Balakrishna : నటుడిగా, రాజకీయ నాయకుడిగా సత్తా చాటుతున్నాడు నందమూరి బాలకృష్ణ. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలలోకి వచ్చారు. ఇప్పుడు సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోను అద్బుతంగా రాణిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో వరుసు హిట్లు సాధిస్తున్న బాలయ్య .. పాలిటిక్స్‌లో మూడో సారి ఎమ్మెల్యేగా అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఈ క్రమంలో బాలయ్య జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. . సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. అంబేడ్కర్విదేశీ విద్యను జగన్విదేశీ విద్యగా పేరు మార్చి గాలికి వదిలేశారంటూ బాలయ్య చురకలు అంటించారు .
Balakrishna : బాగానే సంపాదించారు..
పేద విద్యార్ధులకి ఉన్నత చదువులు అందించే ప్రయత్నం తాము చేస్తామని కూడా బాలయ్య అన్నారు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య ఫ్యామిలీ ఆస్తులకి సంబంధించిన వివరాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. బాలకృష్ణ ప్రస్తుతం ఆస్తుల విలువ 482 కోట్ల రూపాయలు. అందులో చర ఆస్తులు 283 కోట్ల రూపాయలుగా, 199 కోట్ల రూపాయలు స్థిర ఆస్తులుగా పేర్కొన్నారు. ఇక విశాఖపట్నం లోక్ సభ టీడీపీ అభ్యర్థి ఎం. శ్రీభరత్, భార్య తేజస్విని పేరిట ఆస్తుల వివరాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. వారిద్దరి మొత్తం ఆస్తి విలువ రూ.393.41 కోట్లని అఫిడవిట్ లో వెల్లడించారు. వీటిలో… భరత్ పేరిట రూ.16.89 కోట్లు, తేజస్విని పేరుతో రూ.48.36 కోట్ల చరాస్థులు ఉన్నట్లు తెలిపారు.
స్థిరాస్తుల్లో శ్రీభరత్ పేరున రూ.183.95 కోట్లు, భార్య పేరుతో రూ.44.20 కోట్ల ఆస్తులు ఉన్నట్టు సమాచారం. ఇక బంగారం, వెండి విషయానికొస్తే… శ్రీభరత్ పేరిట 7 కిలోల బంగారం, 51.80 కిలోల వెండి ఉండగా.. తేజస్విని పేరున 5.3 కిలోల బంగారం, 52.50 కిలోల వెండి ఉంది. శ్రీభరత్ పై 2 పోలీసు కేసులున్నాయి. ఇక మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ కుటుంబ ఆస్తులు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. వారి ఆస్తుల విలువ రూ.542.17 కోట్లుగా పేర్కొన్నారు. వీటిలో లోకేష్ పేరిట చరాస్తులు రూ.341.68 కోట్లు, స్థిరాస్తులు రూ.92.31 కోట్లు, అప్పు రూ.18.44 కోట్లు ఉండగా… భార్య బ్రాహ్మణికి రూ.45.06 కోట్ల చరాస్తులు, రూ.35.59 కోట్ల స్థిరాస్తులు.. రూ.14.34 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇక బాలయ్య మనవడు దేవాన్ష్ చరాస్తులు రూ.7.35 కోట్లు కాగా.. స్థిరాస్తులు రూ.20.17 కోట్లుగా తెలియజేశారు. లోకేష్, బ్రాహ్మణి, దేవాన్స్‌ల పేరుతో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ లో షేర్లు ఉన్నాయి ఇక పలు పోలీస్ స్టేషన్ లలో లోకేష్ పై 23 కేసులున్నాయి