Balakrishna : పవన్ కళ్యాణ్ అంత మంచోడిని కాదు.. రే జగన్ నా వెంట్రుక కూడా పీకలేవ్.. బాలకృష్ణ మాస్ వార్నింగ్ అదుర్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : పవన్ కళ్యాణ్ అంత మంచోడిని కాదు.. రే జగన్ నా వెంట్రుక కూడా పీకలేవ్.. బాలకృష్ణ మాస్ వార్నింగ్ అదుర్స్

 Authored By kranthi | The Telugu News | Updated on :30 September 2023,6:00 pm

Balakrishna : ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబును అరెస్ట్ చేయించింది ఎవరో కాదు.. వైసీపీ ప్రభుత్వం అని, ఇదంతా జగన్ కుట్ర అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. అయినా కూడా వైసీపీ నేతలు మాత్రం కిక్కుమనడం లేదు. ఉలకడం లేదు పలకడం లేదు. అయితే.. చంద్రబాబు అరెస్ట్ పై బాలకృష్ణ స్పందించారు. ప్రస్తుతం ఆయన చంద్రబాబు అరెస్ట్ తర్వాత పార్టీలో కీలకంగా మారారు. పార్టీలోనూ యాక్టివ్ గా తిరుగుతున్నారు. చంద్రబాబును బయటికి తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన చంద్రబాబు అరెస్ట్ పై మీడియాతో మాట్లాడారు. లోకేష్ బాబు రాష్ట్రమంతా తిరుగుతూ అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని చెబుతున్నారు. ఎక్కడికి పోతున్నాం. రాష్ట్ర పరిస్థితి ఏంటి.. ఆర్థిక పరిస్థితి ఏంటి.. మొత్తం ఇది రాజకీయంగా కంటే కూడా ఒక విప్లవం అని చెప్పుకోవాలి అన్నారు.

టీడీపీనే కాదు.. చాలా పార్టీలు ముందుకు వచ్చాయి. ఏపీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టకొని అందరూ కంకణ బద్ధులై వచ్చే ఎన్నికల్లో మేము కోరేది మీ నిర్ణయమే. మీ దారిలో మీరు నడవాలి. మీరే మీకోసం మీ నాయకుడిని మీరు ఎన్నుకోవాలి. ఓటు అనే ఆయుధం ఉంది. అదే మీకు రక్షణ. అదే ఆయుధం. ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే ఒక అసమర్థ పరిపాలన, చెత్త ప్రభుత్వం, రాజధాని లేని రాష్ట్రం, బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ.. అంటివి చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పారు. రాగానే ఒక సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తా అన్నారు. ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయింది. ఇప్పటి దాకా అసలు ఆ పోలవరం ఊసే ఎత్తలేదు. దాని తర్వాత బడ్జెట్, అప్పులు.. 8 లక్షల కోట్ల రూపాయల అప్పులే ఉన్నాయి. ఎవడబ్బ సొమ్ము అది.. సరే చేశారు.. దానితో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని బాలకృష్ణ ప్రశ్నించారు.

balakrishna reacts on ys jagan comments about pawan kalyan and nara lokesh

#image_title

Balakrishna : ఒక్క పరిశ్రమ అయినా ఏపీకి వచ్చిందా?

ఈ పరిశ్రమలు తీసుకురాలేదు ఇప్పటి వరకు. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఎవ్వరికీ ఉద్యోగాలు రాలేదు. అందరూ వలసలు పోతున్నారు. పేదవాళ్లు, ముసలివాళ్లు, వృద్ధులు రెండు లక్షల మందికి పింఛన్లు నిలిపివేశారు. అలాగే.. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. డ్రగ్స్ మాఫియా, గంజాయిలో మన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంది. విద్యుత్ చార్జీలు పెంచారు. ఆర్టీసీ చార్జీలు పెంచారు. పెట్రోల్ చార్జీలు పెంచారు. డీజిల్ చార్జీలు పెంచారు. ఇంటి మీద పన్ను.. ఇలా అన్నింటి మీద పన్ను వేస్తున్నారు. ఇది మన ఖర్మ కాకపోతే ఇంకేంటి అని నేను అడుగుతున్నాను.. అంటూ బాలకృష్ణ ప్రశ్నించారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది