Balakrishna : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. ఈనేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ నేతలు రోడ్డు మీదికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబును కావాలని అక్రమంగా అరెస్ట్ చేశారని నినదిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతలు పండుగ చేసుకుంటున్నారు. మంత్రి రోజా, కొడాలి నాని అయితే చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదంతా వైఎస్ జగన్ చేసిన కుట్ర అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై బాలకృష్ణ స్పందించారు. జగన్ గురించి ఎవరికి తెలియదు. జగన్ చరిత్ర ఏంటి. 33 కేసుల్లో సీబీఐ కేసులు, ఈడీ కేసులు అన్నీ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. వాళ్ల మీద ఎన్ని కేసులు ఉన్నా బెయిల్ మీద ఎలా తిరుగుతున్నాయి. 10 ఏళ్ల నుంచి ఇన్ని కేసులు ఉన్నా ఎందుకు బెయిల్ మీద తిరుగుతున్నారు అంటూ బాలకృష్ణ ఫైర్ అయ్యారు…
ఇన్నర్ రింగ్ రోడ్ లో స్కామ్ జరిగిందా? భూములు స్వచ్ఛందంగా ఇస్తే అక్కడ కేసు ఎలా అవుతుంది. అసలు భూములు ఇప్పటి వరకు నోటిఫై కాలేదు. దానికి అనుమతులు లేవు. అది క్లారిటీగానే ఉంది. ఆ పనులు ఇంకా జరగనేలేదు. ఎవరో లబ్దిపొందితే.. ఎవరి మీద కేసులు పెడుతున్నారు. సీఎం జగన్ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది. అప్పుడు శాంక్షన్ అయిన ఓఆర్ఆర్ ని అష్ట వంకరలు తిప్పారు. అప్పుడు అంబటి రాంబాబు వీళ్లంతా లబ్ధి పొందలేదా? అంటూ బాలకృష్ణ మండిపడ్డారు. కేసు అంటే ఏంటి.. ఎవరైనా ఫిర్యాదు చేయాలి. ఎవరైనా ఫిర్యాదు చేశారా? అంటూ ప్రశ్నించారు.
నారా లోకేష్ ప్రస్తుతం యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఆయన యాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక కక్ష సాధింపు చర్యగా ఇవన్నీ చేస్తున్నారు. చంద్రబాబు చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుక కూడా పీకలేరు. పిక్క మీద ఉన్న వెంట్రుక కూడా పీకలేరు.. అంటూ బాలకృష్ణ మండిపడ్డారు. అరెస్టులకు భయపడే రకం కాదు మేము. జైలుకు వాళ్లకు భయపడాలి కానీ.. మేము భయపడం. తప్పు చేయనప్పుడు మేము దేవుడికి కూడా భయపడం.. అంటూ బాలకృష్ణ.. జగన్ కు వార్నింగ్ ఇచ్చారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.