Bandi Sanjay : రేవంత్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్
ప్రధానాంశాలు:
Bandi Sanjay : రేవంత్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ఈ ఘటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తప్పు పట్టాల్సిన పని లేదని, ఆయన కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కరీనంగర్‌లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. పవన్ కళ్యాణ్ ఏమన్నారో తనకు తెలియదు, తాను వినలేదన్నారు. రేవంత్‌రెడ్డి నిజంగా గొప్ప నాయకుడని అని అంటే.. ఆయనలో ఏం కన్పించిందో.. 6 గ్యారంటీలను అమలు చేయలేదు. ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదు.
క్రైం రేటు పెరిగింది. మరి ఆయనలో గొప్ప నాయకుడు ఎట్లా కన్పించారో వారికే తెలియాలని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిలో పవన్ కళ్యాణ్ మెచ్చుకోదగిన లక్షణాలు ఏంటని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడిగా కనిపించడం ఏమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. అతని నాయకత్వంలోని ఏ అంశం అతనికి విశేషమైనదిగా అనిపిస్తుంది? రైతు భరోసా, బంగారు నాణేల కార్యక్రమం, రెండు లక్షల ఉద్యోగాల వాగ్దానం, నిరుద్యోగ భృతి ₹ 4,000, ఆసరా పింఛన్ల పెంపు చేయకపోవడమా అని తీవ్రంగా విమర్శించారు.
ఈ వాగ్దానాలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని బండి సంజయ్ ఆరోపించారు మరియు పవన్ కళ్యాణ్ అనుకూల వ్యాఖ్యలకు ఇటువంటి అమలు కాని హామీలు కారణమని పేర్కొన్నారు. Bandi Sanjay, Pawan Kalyan, Revanth Reddy, allu arjun