Bhuma Akhila Priya : జూలు విదిల్చిన భూమా అఖిలప్రియ — సొంత పార్టీ కే బ్లాస్టింగ్ న్యూస్ చెప్పింది !
Bhuma Akhila Priya : అసలు టీడీపీ పార్టీలో ఏం జరుగుతోంది. అసలే వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ప్రస్తుతం నంద్యాల జిల్లా టీడీపీలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. నంద్యాల జిల్లా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు పెరుగుతున్నాయి అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. నంద్యాల రాజకీయాలు అనగానే మనకు గుర్తొచ్చేది భూమా అఖిల ప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి.
భూమా బ్రహ్మానందరెడ్డికి, భూమా అఖిలప్రియకు అస్సలు పొసగడం లేదు. ఏవీ సుబ్బారెడ్డితోనూ ఆమెకు పడటం లేదు. నంద్యాలలో నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కాగానే ఏం జరిగిందో తెలుసు కదా. ఏవీ సుబ్బారెడ్డిపైనే అఖిలప్రియ వర్గం దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి ఒక వారం కర్నూలు జైలులో ఉంచారు. అయితే.. ఆ కథ అంతటితో ముగిసిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. తాజాగా.. అఖిలప్రియ.. టీడీపీ నేత బొండా ఉమ కోడలిపై కేసు వేశారు. అది కూడా పరువు నష్టం దావా.ఇటీవల అఖిలప్రియ.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేయించారనే ఆరోపణలు వచ్చాయి కదా. బొండా ఉమ కోడలు ఎవరో కాదు.. ఏవీ సుబ్బారెడ్డి కూతురు. బొండా ఉమ కొడుకు సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకుంది. వీళ్లు యూఎస్ లో ఉంటారు. ఇటీవల తన తండ్రి ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగిన తర్వాత, సుబ్బారెడ్డి కూతురు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది.
Bhuma Akhila Priya : అఖిలప్రియకు, బొండా ఉమ కోడలికి మధ్య ఏం జరిగింది?
ఆ వీడియోలో అఖిలప్రియపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏవీ సుబ్బారెడ్డిపై, ఆయన కూతురుపై అఖిలప్రియ పరువు నష్టం దావా వేశారు. దీంతో మరోసారి సుబ్బారెడ్డి, అఖిలప్రియ మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరినట్టు అయింది. అఖిలప్రియ ప్రవర్తనపై బొండా ఉమా కూడా సీరియస్ గా ఉన్నారు. టీడీపీ అధిష్ఠానానికి అఖిలప్రియపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అఖిలప్రియ వల్ల నంద్యాల జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారవుతోందని, అఖిలప్రియపై చర్యలు తీసుకోకపోతే నంద్యాల, ఆళ్లగడ్డలో మరోసారి పార్టీ ఓడిపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబుకు బోండా ఉమ తెలిపినట్టు తెలుస్తోంది. చూడాలి మరి.. అఖిలప్రియ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?