Big Breaking Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్ట్..!
Big Breaking Allu Arjun Arrest : పుష్ప 2 సినిమా రిలీజ్ టైం లో సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందు చూపు లేకుండా వచ్చినందుకు అల్లు అర్జున్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ ని తీసుకెళ్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఆ సంఘటన జరిగిన టైం లో సంధ్య థియేటర్ ఓనర్ ఇంకా సెక్యురిటీ ఇంచార్జ్ ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కేసులో అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేశారు. ఐతే పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్ లో భారీ కలెక్షన్స్ తో హంగామా చేస్తున్న టైం లో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అతని ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. ఐతే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత లీగల్ ప్రొసీడింగ్ ఎలా ఉంటుంది. ఈ కేసు ఎక్కడిదాకా వెళ్తుంది. అసలు అల్లు అర్జున్ ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అన్న విషయం పై ఇంకా డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.

Big Breaking Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్ట్..!
Big Breaking Allu Arjun Arrest పోలీసులు అరెస్ట్ చేసే ముందు కాఫీ కప్ తో..
ఐతే అల్లు అర్జున్ మాత్రం అరెస్ట్ ని ఊహించలేదు. పోలీసులు అరెస్ట్ చేసే ముందు కాఫీ కప్ తో కనిపించారు. సంధ్య థియేటర్ కు ఎలాంటి ముందు పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఐతే పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం వల్ల ఈ కేసు మరింత తీవ్రత సాధించే అవకాశం ఉంది.
పోలీసులు అల్లు అర్జున్ తన వెంట రావాలని చెబుతున్నారు. అల్లు అర్జున్ మీద మూడు సెక్షన్లలో కేసు పెట్టినట్టు తెలుస్తుంది. ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఐతే కోర్టులో అల్లు అర్జున్ కూడా రివర్స్ కేసు వేశాడు. అది హియరింగ్ కి రాకుండానే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. Allu Arjun, Allu Arjun Arrest, Pushpa 2, Movie ,