Wife : భర్త నాలుకని కొరికి మింగేసిన భార్య..!
ప్రధానాంశాలు:
Wife : భర్త నాలుకని కొరికి మింగేసిన భార్య..!
Wife : వామ్మో.. రోజు రోజుకూ కొందరు మనుషులు మృగాళ్లలా తయారు అవుతున్నారు. భార్యభర్తల మధ్య వచ్చే గొడవలతో.. దంపతులు ఒకరిపై ఒకరు దా- చేసుకుంటున్నారు. తాజాగా భర్తతో జరిగిన చిన్న గొడవకే విపరీతమైన కోపం తెచ్చుకున్న ఓ భార్య.. అతడిపై దాడికి పాల్పడింది. ముఖ్యంగా అతడి మీద పడి నాలుక కొరికేసి మరీ నమిలి మింగేసింది.

Wife : భర్త నాలుకని కొరికి మింగేసిన భార్య..!
Wife : రాక్షసత్వం..
ఆపై తీవ్ర రక్తస్రావం అవుతున్నా పట్టించుకోకుండా గొడవ పడుతూనే ఉంది. విషయం గుర్తించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడకు కూడా వెళ్లిన భార్య పిచ్చిగా ప్రవర్తించింది. బీహార్ గయా జిల్లాలోని ఖిజ్రాసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ గ్రామంలోఈ ఘటన చోటు చేసుకుంది. ఛోటే దాస్ అనే వ్యక్తికి చాలా రోజుల క్రితమే వివాహం కాగా.. వీరి కాపురం హాయిగానే సాగుతోంది. అయితే మొన్నటి వరకు ఇద్దరూ ప్రేమగానే ఉన్నా ఈ మధ్య కాలంలో వీరి మనస్పర్థలు వచ్చాయి.
దీంతో తరచుగా గొడవలు పడుతున్నారు. తాజాగా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు మాటా మాటా అనుకున్నారు. ఈక్రమంలోనే ఛోటే దాస్ భార్య తీవ్ర ఆగ్రహానికి గురైంది. కోపంతో ఊగిపోతూ.. భర్త నాలుకను తన నోటితో పట్టేసింది. పళ్లతో నాలుకను గట్టిగా కొరికేసింది. అతడి నాలుక ఆమె నోట్లోకి రాగా.. అతడి కళ్ల ముందే నమిలి మింగేసింది. భార్య నాలుక కొరికేయగానే.. తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో ఛోటే దాస్ బయటకు పరుగులు పెట్టాడు. ఇంత జరుగుతున్నా.. ఆస్పత్రిలో కూడా భార్యా భర్తలు గొడవ పడుతూనే ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.