Pawan Kalyan : పాపం పవన్ కళ్యాణ్.. చివరికి గాజువాక కూడా లేకుండా చేసిన బీజేపీ !
Pawan Kalyan : ఏపీలో జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అని టక్కున అడిగితే.. చాలా సేపు ఆలోచించి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. కానీ.. ఒకటి రెండు నియోజకవర్గాల్లో మాత్రం జనసేన పార్టీకి కాస్తో కూస్తో బలం ఉంది. అందులో గాజువాక ఒకటి. అక్కడ ఖచ్చితంగా జనసేన గెలుస్తుంది అని చెప్పలేం కానీ.. ఆ నియోజకవర్గంలో జనసేనకు బాగా పాపులారిటీ ఉంది. కానీ.. ఇదే నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు పవన్ కళ్యాణ్. అందుకే ఇప్పుడు గాజువాక సీటు అందరికీ ఫేవరేట్ అయిపోయింది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గాజువాకను చేజిక్కించుకోవాలని చాలా పార్టీలు పోటీ పడుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో కూడా గాజువాక నుంచే పోటీ చేయడానికి జనసేన పార్టీ సమాయత్తం అవుతోంది. కానీ.. ఒకవేళ టీడీపీతో పొత్తు ఉంటే జనసేనకు ఆ సీటు దక్కుతుందా లేదా అనేది తెలియదు. కానీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం కొన్ని సీట్లను తమకే కేటాయించాలని ముందే డిసైడ్ చేసుకున్నారట. మరోవైపు టీడీపీకి కూడా గాజువాకలో పట్టు ఉంది. అందుకే టీడీపీ కూడా ఆ సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేదు.ఒక్క గాజువాక సీటు నుంచి అటు టీడీపీ, ఇటు జనసేన.. మరోవైపు బీజేపీ కూడా పోటీ చేసి గెలవాలని టార్గెట్ చేశాయి. ఈనేపథ్యంలో ఉత్తరాంధ్రలో గాజువాక సీటుపై అన్ని పార్టీలు తమ ఫోకస్ ను పెంచాయి. గాజువాకలో తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తాజాగా గాజువాకలో పర్యటించారు.
Pawan Kalyan : గాజువాకపై కన్నేసిన బీజేపీ
బీజేపీ అక్కడ పటిష్ఠంగానే ఉందన్నారు. గాజువాకను స్ఫూర్తిగా తీసుకొని మిగితా నియోజకవర్గాల్లో పార్టీని పటిష్ఠం చేయాలని జీవీఎల్ సూచించారు. అయితే.. గాజువాకలో బీజేపీకి బలం ఎక్కువగా ఉండటానికి కారణం అది వైజాగ్ కు సమీపంలో ఉండటం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉండటం. అందుకే.. గాజువాక సీటును ఎలాగైనా ఈసారి గెలిపించుకోవాలని బీజేపీ తెగ ఉబలాటపడుతోంది. ఈనేపథ్యంలో జనసేన వ్యూహం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.