Raghunandan Rao : దుబ్బాకలో కాంగ్రెస్‌కి చాన్స్ ఇస్తున్న రఘునందన్ రావు? చేతులెత్తేశాడా?
Raghunandan Rao : తెలంగాణలో ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి నెలకొన్నది. ఇక.. బీఆర్ఎస్ పార్టీ అయితే ఎన్నికలకు మూడు నెలల ముందు గానే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. కానీ.. ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అలాగే.. బీజేపీ కూడా అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.
దుబ్బాక నియోజకవర్గంలో 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి గెలిచారు. అంతకముందు ఎన్నికల్లో చెరుకు ముత్యం రెడ్డి కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. సోలిపేట మృతితో 2020 ఉపఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిచింది. రఘునందన్ రావు ఎమ్మెల్యే అయ్యారు. అయితే.. ప్రస్తుతం దుబ్బాక బీజేపీ నేతలతో రఘునందన్ రావుకు పొసగడం లేదట. సొంత పార్టీలో, సొంత నియోజకవర్గంలోనే బీజేపీలో వర్గాలుగా విడిపోయారట. అధికార పార్టీపై, బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడే రఘునందన్ రావు.. సొంత పార్టీ నేతలతో మాత్రం సఖ్యతగా ఉండలేకపోతున్నారు. మరోవైపు దుబ్బాకలో అభివృద్ధి కూడా శూన్యం. అధికార పార్టీ నుంచి నిధులు తీసుకురాలేక.. అభివృద్ధి చేయలేకపోతున్నారు రఘునందన్ రావు.
Raghunandan Rao : కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి?
కమలంలో పార్టీలోనూ దుబ్బాకలో రఘునందన్ రావుకు పోటీగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా మరికొంత మంది బీజేపీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి తన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఈసారి బీఆర్ఎస్ అక్కడ గెలవాలని పక్కా వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. దుబ్బాక నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఆయనకు దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా తనకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఆయనకే టికెట్ కూడా కన్ఫమ్ అయ్యే చాన్స్ ఉంది. మూడు పార్టీల నేతలను చూస్తే.. ఈ సారి చెరుకు శ్రీనివాస్ రెడ్డికే ఎక్కువ ప్రజాబలం ఉందని.. రఘునందన్ రావు అభివృద్ధిలో చేతులెత్తేయడం, సొంత పార్టీ నేతలతో పొసగకపోవడం వంటి కారణాలతో ప్రజలు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?